పవన్ కళ్యాణ్ నీడ, ఆయనకి శ్రేయోభిలాషి, ఆప్త మిత్రుడు.. పవన్ కళ్యాణ్ సినిమాలకి బ్యాక్ బోన్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది కొత్తగా చెప్పేది కాదు.. తెలియని వారు లేరు. పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకున్నారు అంటే దాని వెనుక ఖచ్చితంగా త్రివిక్రమ్ ఉంటారు. అదే విషయం పవన్ కళ్యాణ్ కూడా చేబుతారు. అసలు ఆయన రాజకీయాల నుండి సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక త్రివిక్రమ్ చెప్పబట్టే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ నిన్న వచ్చిన BRO చిత్రాలని రీమేక్ చేసారు. వాటికి తివిక్రమ్ కూడా షాడోలో పని చేసారు.
వకీల్ సాబ్ కి వేణు శ్రీరామ్ దర్శకుడే.. కానీ దాని వెనుక నిలబడింది త్రివిక్రమే. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అలాగే ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో కూడా త్రివిక్రమ్ చెప్పారు. ఇక భీమ్లా నాయక్ కి సాగర్ కే చంద్ర దర్శకుడు. కానీ భీమ్లా నాయక్ కి కర్త, కర్మ, క్రియ అన్ని త్రివిక్రమే. ఊరికే ఏమి చెయ్యడం లేదు. త్రివిక్రమ్ మేకర్స్ నుండి భారీగా పారితోషం అందుకుంటున్నారు. అయితే వకీల్ సాబ్-భీమ్లా నాయక్ ఫలితాలు పవన్ ఫాన్స్ ని ఖుషి చేసాయి. మేకర్స్ కూడా సేవ్ అయ్యారు. ఇప్పుడు సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కి హిట్ అయిన వినోదియం సిత్తం చిత్రాన్ని తెలుగులో పవన్ తో రీమేక్ చేద్దామనుకుని ముందుగా త్రివిక్రమ్ ని కలిస్తే.. ఆయనే పవన్ ని ఒప్పించారు.
ఇక త్రివిక్రమ్ సముద్రఖని స్క్రిప్ట్ ని తెలుగు వారికి, ఫాన్స్ కి నచ్చేలా మార్చేసి సముద్రఖనితో దర్శకత్వం చేపించి.. స్క్రీన్ ప్లే-డైలాగ్స్ ఆయనే చూసుకున్నారు. ముందు నుండి ఈప్రాజెక్టు లో త్రివిక్రమ్ పేరు బాగా వినిపించేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే త్రివిక్రమ్ కి అంత బ్రాండ్ వాల్యూ ఉంది కనక. కానీ BRO విషయానికి వస్తే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే పై రకరకాల కామెంట్స్.. అన్ని నెగటివ్ కామెంట్స్ పడుతున్నాయి. పవన్ పెద్ద స్టార్ అయినా.. త్రివిక్రమ్ కి ఓ ఫ్యాన్ కేటగిరి ఉంది. ఆయన కోసమే సినిమాలకి వెళ్లే వారు చాలామంది ఉన్నారు.
కానీ BRO విషయంలో ఆ త్రివిక్రముడే ఆడియన్స్ ని ముంచేశారు. ఇకపై పవన్ కళ్యాణ్ సినిమాల్లో త్రివిక్రమ్ పని చేసినా ఆడియన్స్ కాని.. ఫాన్స్ కూడా నమ్మేలా కనిపించడం లేదు. BRO రిజల్ట్ పై ఆఖరికి పవన్ ఫాన్స్ కూడా త్రివిక్రమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ కేవలం పవన్ కి ఈ రీమేక్ లు అంటగడుతున్నారంటూ వారు ఫైర్ అవుతున్నారు.