పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల కలయికలో సముద్రఖని తెరకెక్కించిన BRO చిత్రం నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. BRO మూవీకి ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది. పవన్ ఫాన్స్ కి మాత్రం BRO బాగా నచ్చేసింది. సినిమా ఎలా ఉన్నా ఫాన్స్ కి నచ్చుతుందనుకోండి అది వేరే విషయం. అటు సినీ విశ్లేషకుల నుండి కూడా BRO కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అయితే సినిమా చూసి బయటికొచ్చాక ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి సినిమా ఎలా ఉంది అంటూ పబ్లిక్ టాక్ ని చంక్స్, యూట్యూబ్ ఛానల్స్ గేదర్ చెయ్యడం అవి వైరల్ అవడం చూస్తున్నాం.
ఈమధ్యన IMAX దగ్గర ఆదిపురుష్ సినిమా బాలేదు అని ఓ ప్రేక్షకుడు చెబితే అక్కడే ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఆ ప్రేక్షకుడిపై తిరగబడి దాడి చేసారు. ఇప్పుడు కూడా బ్రో మూవీ అంతగా లేదంటా, మిక్స్డ్ రెస్పాన్స్ అంటగా అంటూ ఛానల్స్ వాళ్ళు పవన్ ఫ్యాన్ ఒకరిని అడగ్గానే పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. సినిమా ఎట్లుందని అడుగు అంతే కానీ లాగ్ ఉందా, అట్లుందా అని సజెస్ట్ చేయకు అంటూ కెమెరా మ్యాన్ పై పవన్ ఫ్యాన్ ఫైర్ అయిన వీడియో వైరల్ గా మారింది.
ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే పాటలు, ఫైట్స్ మాత్రమే అనుకునే వారికి ఈ సినిమా చుస్తే ఆ మాట తప్పు అనిపిస్తుంది. ఇలాంటి కథలకు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ అవసరం లేదు, కానీ ప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఉండాల్సిందే.. కచ్చితంగా కుటుంబంతో చూడదగ్గ సినిమా.. అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు BRO సినిమా ఏమి బాలేదు, కేవలం పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి సినిమా అమ్మేసి ప్రేక్షకులని మోసం చేసారు అంటున్నారు.
తాజాగా BRO సక్సెస్ సెలెబ్రేషన్స్ లో తమిళంలో వినోదియం సిత్తం హిట్ కదా.. కానీ ఇక్కడ BRO కి మిక్స్డ్ టాక్ వచ్చింది అనగానే సాయి ధరమ్ తేజ్ ఈ రోజుల్లో మిక్స్డ్ టాక్ అనేదే లేదు.. అయితే హిట్టు, లేదంటే డిసాస్టర్ అంటూ ఆన్సర్ ఇవ్వగా.. సముద్రఖని మాత్రం నాకు పబ్లిక్ టాక్ గురించి తెలియదు, మా సినిమా హిట్టు అంటూ చెప్పుకొచ్చారు.