చాలామంది జబర్దస్త్ కమెడియన్ జబర్దస్త్ లో బాగా ఫేమస్ అయ్యి ఆ తర్వాత ఇతర కారణాలతోనే, లేదంటే పారితోషకాల పరంగా కొంతమంది స్టార్ మా బిగ్ బాస్ లోకి అడుగుపెడుతున్నారు. అందులో ముక్కు అవినాష్, చలాకి చంటి, అలాగే ఫైమా ఇలా చాలామంది జబర్దస్త్ ఉంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినవారు. ఇక గత సీజన్ లో లోకి చలాకి చంటి, ఫైమాలు ఎంటర్ అవ్వగా.. చంటి అక్కడ జబర్దస్త్ లో ఉన్నట్టుగా బిగ్ బాస్ ఎంటర్టైన్ చెయ్యలేక మధ్యలోనే ఎలిమినేషన్ ద్వారా బయటికి వచ్చేసాడు.
ఆ తర్వాత చంటి ఎక్కడా, ఎప్పుడూ కనిపించలేదు. అయితే గత ఏప్రిల్ లో చంటి హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో ICU లో చికిత్స తీసుకుంటున్నాడు, అతని పరిస్థితి విషమం అంటూ వార్తలు మీడియాలో కనిపించాయి. ఆ తర్వాత చంటి విషయం అందరూ మరిచిపోయారు. అయితే తాజాగా చంటి ఉన్నట్టుండి జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేస్తూ కనిపించాడు. దానితో ఆయన ఫాన్స్ కాస్త హ్యాపీగా ఫీలవుతున్నారు. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక వన్ ఇయర్ అగ్రిమెంట్ స్టార్ మా ఉంటుంది. అది పూర్తి కాగానే చంటి మళ్ళీ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చాడంటున్నారు.
అయితే చంటి ఈ జబర్దస్త్ స్టేజ్ పై తన హెల్త్ రీజన్స్ గురించి ఏమైనా ఓపెన్ అవుతాడేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఎందుకంటే చంటి జబర్దస్త్ సెట్జ్ పైకి రీ ఎంట్రీ ఇచ్చాడు కానీ.. కాస్త డల్ గానే కనిపించాడు.