ఈరోజు మెగా హీరోస్ పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల BRO మూవీ విడుదలైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలని కూడా లెక్క చెయ్యకుండా బ్రో మూవీ టికెట్స్ తెగాయి. థియేటర్స్ కి ప్రేక్షకులు పోటెత్తారు. సముద్రఖని దర్శకత్వంలో త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడ్రెన్ గాడ్ గా కనిపించగా.. ఆయనకి భక్తుడిగా సాయి ధరమ్ తేజ్ కనిపించాడు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని పవన్ తనయుడు అకీరా నందన్ హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ లో అభినులతో కలిసి వీక్షించడం హాట్ టాపిక్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ BRO మూవీని చూసేందుకు హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MM థియేటర్ కి వచ్చాడు. అక్కడ పవన్ ఫాన్స్ తో కలిసి సినిమా చూసాడు, మాస్క్ తో బయటికొస్తున్న తరుణంలో అకీరాని గుర్తుపట్టేసిన కొందరు వీడియో తీస్తూ దానిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అకీరా కి 18 ఏళ్ళు నిండాయి. అకీరా ఎప్పుడెప్పుడు సినిమాలోకి ఎంటర్ అవుతాడా అని పవన్ ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.
పవర్ స్టార్ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే క్షణం కోసం పవన్ అభిమానులు బాగా వెయిట్ చేస్తున్నారు. ఇదిగో ఇలా కనిపించినప్పుడల్లా అలా అకీరాని చుట్టుముట్టేస్తూ ఉంటారు.