నయనతార కి ఎన్ని బాలీవుడ్ ఛాన్సెస్ వచ్చినా, ఎన్ని కోట్లు పారితోషకం ఆఫర్ చేసినా ఇంత వరకు ఆమె హిందీలో కాలు పెట్టలేదు. సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకుంటూ లేడీ సూపర్ స్టార్ లా కీర్తి ప్రతిష్తలు సంపాదించింది. అయితే ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో నయనతార ఫస్ట్ టైమ్ హిందీలోకి అడుగుపెడుతుంది. అది కూడా తమిళ డైరెక్టర్ అట్లీ తో కలిసి. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ తో కలిసి నటిస్తున్న నయన్ ఈ చిత్రంలో పోలీస్ అధికారికంగా లుక్స్ వైజ్ గా అదుర్స్ అనిపించింది.
అయితే ఈ చిత్రంలో కోసం షారుఖ్ ఖాన్ 100 కోట్ల భారీ పారితోషకం తీసుకుంటున్నట్టుగా టాక్ నడుస్తుంది. ఇక నయనతారకు మేకర్స్ 10 కోట్లు ఇస్తున్నారట. నయనతార ఈ చిత్రం కోసం అత్యధిక పారితోషకం అందుకోబోతుంది అని సమాచారం. ఇక విలన్ గా నటించిన విజయ్ సేతుపతి కూడా మేకర్స్ భారీగానే ఇస్తున్నారు. విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఏ కేరెక్టర్ చేసినా అందులో జీవించేస్తారు.
అలాంటి విజయ్ సేతుపతి దాదాపుగా 21 కోట్లు జవాన్ కోసం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అది లెక్క.. నయన్ కి పది, విజయ్ సేతుపతి 21 అన్నమాట.