పవన్ కళ్యాణ్ నటించిన బ్రో మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చకచకా పూర్తి చేసిన ఈ ప్రాజెక్ట్ అంతే స్పీడుగా ఆడియన్స్ ముందుకు వచ్చి చేరింది. ఇక ఇప్పుడు OG వంతు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. OG మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. దానయ్య తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియా లెవల్లో ఉండబోతున్నట్టుగా అందులోకి యాడ్ అవుతున్న నటులని చూస్తే అర్ధమవుతుంది.
అయితే ఈ చిత్రాన్ని ఈ డిసెంబర్లో విడుదల చేసేందుకు మేకర్స్ కుస్తీలు పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని సుజిత్ ముగించేసాడు. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను సుజిత్ చుట్టేస్తున్నాడు. అయితే OG టీజర్ కి టైమ్ ఫిక్స్ అయ్యింది అనే ఓ న్యూస్ పవన్ ఫాన్స్ ని సంబరపడేలా చేసింది. సెప్టెంబర్ 2 అంటే పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున OG నుండి ఫస్ట్ లుక్ అలాగే టీజర్ వదలబోతున్నారని సమాచారం. మరి సెప్టెంబర్ 2 న ఆయన బర్త్ డే రోజున OG నుండి టీజర్, మరియు ఫస్ట్ లుక్ వస్తే ఫాన్స్ కి పూనకాలే.