శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా మారిపోయింది. రెండు సినిమాల్లో నటించిన శ్రీలీలకి ఆ చిత్రాల రిజల్ట్ తో సంబంధమే లేకుండా వరసగా ఎనిమిది ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. శ్రీలీల డాన్స్, ఆమె బ్యూటీ ఫుల్ లుక్స్ అన్ని ఆమెకి లక్కీగా మారిపోయాయి. దానితో ఇప్పుడు శ్రీలీల టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే టాలీవుడ్ లో ఈ బ్యూటీ రెండు చిత్రాలకే ఎంతెలా బిజీ అయ్యిందో అలాగే ఇప్పుడు కోలీవుడ్ లోను మరో హీరోయిన్ అంతగానే బిజీ తారగా మారింది.
దర్శకుడు శంకర్ ముమార్తె అదితి శంకర్. ఈ అమ్మాయి గతేడాది విరుమాన్ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈమధ్యనే శివ కార్తికేయన్ తో అదితి నటించిన మాహావీరుడు సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గానే కాదు.. సింగర్‌గానూ అదరగొట్టేసింది. మొదటి సినిమా నిరాశ పరిచినా, రెండో సినిమా కాస్త హిట్ అయ్యేసరికి అదితి శంకర్ కి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి. ఇవే కాకుండా అదితి మరో రెండు సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని తెలుస్తోంది. అయితే అదితి చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. కానీ అవేమి ఆమె టాలెంట్ చూసి రాలేదు.. కేవలం ఆమె తండ్రి గొప్ప డైరెక్టర్ కావడం చేతే ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు. అంతేకాని ఆమె నటన బావుంది అని కానీ, లేదంటే మారేదన్నా కారణమో కాదు.. నటిగా ఆమె మెప్పించలేకపోతుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక సోషల్ మీడియాలో కాస్త యాక్టీవ్ గా కనిపించే అదితి శంకర్ తాజాగా పోస్ట్ చేసిన రెడ్ అవుట్ ఫిట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. మీరు ఈ బ్యూటిఫుల్ పిక్స్ ని ఓ లుక్కెయ్యండి.