పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు రామ్ చరణ్ ని చూసుకోమని చెబితే చరణ్ దగ్గర డబ్బులు కొట్టేసేవాడట. ఈ విషయం చరణ్ కానివ్వండి, పవన్ కానివ్వండి చాలాసార్లు చెప్పారు. అయితే మేనల్లుళ్లు సాయి తేజ్, వైష్ణవ తేజ్ లతో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి బాండింగ్ ఉంది. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కి రోడ్ యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో కోమాలో ఉండగా తాను ఎంతగా అల్లాడిపోయాడో అనేది పవన్ కళ్యాణ్ స్వయంగా బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పారు. తాజాగా బ్రో తో పవన్-సాయి ధరమ్ తేజ్ లు నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ తమ మేనమామ పవన్ కళ్యాణ్ తో చిన్నప్పుడు తానెలా ఉండేవాడో అనే పిక్ ని, అలాగే మేనమామ పవన్ పై ఎమోషనల్ గా ఓ నోట్ ని సెండ్ చేసాడు. అందులో పవన్ కళ్యాణ్ తన కాళ్ళతో సాయి ధరమ్ ని కట్టేసినట్టుగా.. అలాగే పవన్ కళ్యాణ్ నిద్రపోతూ కనిపించిన పిక్ అది. దానితో పాటుగా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. మావయ్య పవన్ కల్యాన్‌పై తనకున్న ప్రేమను, అభిమానాన్నంతటినీ మరోమారు ఇలా లేఖ రూపంలో చూపించేసాడు.
ఇంతకీ ఆ నోట్ లో ఏముందంటే.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఈ రోజును ఏమని పిలవాలి.? నా కల నెరవేరిన రోజు.. మర్చిపోలేని రోజు.. జీవితంలో గుర్తుండిపోలేని ఓ మధరు జ్ఞాపకం. నా మనసులోని భావాలను, జ్ఞాపకాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురువు అయిన, మామయ్య అయిన, మామ నాకు అన్నీ పవన్ కళ్యాణ్ మావయ్యే. ఆయన్ని చూస్తూ ఎదిగాను. ఇప్పటికీ ఆయన చేతిని పట్టుకుని నడుస్తున్న చిన్నపిల్లవాడినే. దర్శకుడు త్రివిక్రమ్ గారు నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు
నా ముగ్గురు మామలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అందరు హీరోలు, సినీ అభిమానులు మీ అందరి ప్రేమాభినాలు, సపోర్ట్ అన్ని నన్ను నడిపిస్తున్నాయి. నాకన్నా ఈ బ్రో మీకే మీకే సొంతం. ఈ మువీ మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నా కల నేరవేర్చడంలో భాగమైన ప్రతిఒక్కరికీ మరోసారి ధన్యవాదాలు అంటూ సాయిధరమ్ తేజ్ ఆ పిక్ తో పాటుగా ఇలా లేఖ రాసుకొచ్చాడు.