Advertisementt

ప్రభాస్ FB ఖాతా హ్యాక్

Thu 27th Jul 2023 10:14 PM
prabhas  ప్రభాస్ FB ఖాతా హ్యాక్
Prabhas FB Account Hacked ప్రభాస్ FB ఖాతా హ్యాక్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం అమెరికా ట్రిప్ ముగించుకుని ఇండియాకి వచ్చేస్తున్నారు. ఆదిపురుష్ విడుదలకు రెండు రోజుల ముందే ఆయన అమెరికా వెకేషన్ కి వెళ్లిపోయారు. రీసెంట్ గా అమెరికాలో ప్రాజెక్ట్ K టైటిల్ లాంచ్ లో పాల్గొన్నారు. అక్కడ ప్రభాస్ లుక్స్ ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ప్రభాస్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండరు. ఆయనకి ట్విట్టర్ లో ఎకౌంట్ కూడా లేదు. ఫేస్ బుక్, ఇన్స్టాలో కాస్త కనిపిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరికైనా విషెస్ చెప్పడానికి కానీ, లేదంటే తన సినిమా కి సంబందించిన అప్ డేట్ కానీ ఇస్తూ ఉంటారు.

ఫేస్ బుక్ లో ప్రభాస్ 2013 వ సంవత్సరంలో అడుగుపెట్టారు. అంటే ఆయన ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతుంది. అందులో ఆయనకి 24 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాండిల్ నుండి ఓ వీడియో దర్శనమిచ్చింది. మనుషులు దురదృష్టవంతులు అంటూ ఆ వీడియో లో క్యాషన్ కనిపించగానే ప్రభాస్ ఫాన్స్ ఎలర్ట్ అయ్యారు. ప్రభాస్ సోషల్ మీడియాలోని ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యింది అంటూ పోస్ట్ లు పెట్టారు.

దానితో ప్రభాస్ టీం కూడా త్వరగా అప్రమత్తమై సమస్యని పరిష్కరించి మళ్ళీ ఫేస్ బుక్ ఖాతాని పునరుద్దరించినట్టుగా తెలుస్తోంది. దానితో ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వెకేషన్స్ ముగించుకుని సలార్ ప్రమోషన్స్ అలాగే కల్కి షూటింగ్, మారుతీ మూవీస్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు.

Prabhas FB Account Hacked:

Prabhas Face Book Account Hacked, Viral Video Posted! 

Tags:   PRABHAS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ