Advertisementt

సమంత జీవించేసింది

Thu 27th Jul 2023 08:35 PM
samantha  సమంత జీవించేసింది
Samantha-Vijay Devarakonda cute romance in Kushi movie సమంత జీవించేసింది
Advertisement
Ads by CJ

సమంత ప్రస్తుతం షూటింగ్స్ నుండి భారీ విరామం తీసుకుని ఆరోగ్యంపై శ్రద్ద పెట్టబోతోంది అనే ప్రచారాన్ని పక్కనబెట్టి మరీ తన ఫ్రెండ్ తో కలిసి బాలి లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ బాలి వెదర్ లో మార్నింగ్ వాక్, రెస్టారెంట్ లో ఫుడ్ తినడం, రోడ్ ట్రిప్, యోగ చెయ్యడం, అలాగే అసాధ్యమయ్యే వర్కౌట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో హైలైటవుతుంది. అయితే సమంత శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి మూవీలో నటిస్తుంది. ఈ చిత్రంలో సమంత-విజయ్  దేవరకొండ కెమిస్ట్రీ బాగా హైలెట్ అయ్యేలా కనబడుతుంది. విజయ్ దేవరకొండ తో కలిసి ఆరాధ్య సాంగ్ లో అదిరిపోయే రొమాన్స్ చేసింది.

ఇప్పుడు టైటిల్ సాంగ్ బయటికొచ్చే సమయంలో ఖుషి నుండి ఒక పోస్టర్ బయటికి వచ్చింది. విజయ్ దేవరకొండ సమంత ఉన్న క్యూట్ పోస్టర్ అది. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచడమే కాదు.. రొమాంటిక్ సన్నివేశాల్లో సమంత జీవించేస్తుంది అనేలా విజయ్ దేవరకొండతో సమంత కెమిస్ట్రీ కనిపించింది. సైకిల్ మీద విజయ్ తో సమంత క్లోజ్ గా మూవీ అవుతూ రొమాన్స్ పండించింది. అందులో సమంత గ్లామర్ గా కనిపించడమే కాదు.. విజయ్ తో కలిసి అద్భుతః అనిపించింది.

ఇక సమంత ఖుషి మూవీ షూటింగ్ కంప్లీట్ చేసేసింది. అలాగే హిందీ సిటాడెల్ షూటింగ్ కూడా పూర్తి చేసి ప్రస్తుతం బాలిలో రిలాక్స్ అవుతుంది. త్వరలోనే సమంత అమెరికా వెళ్లబోతుంది అని తెలుస్తోంది. ఆమె అమెరికా ప్రయాణం మాయోసైటిస్ నుండి ఉపశమనానికే అని తెలుస్తోంది.

Samantha-Vijay Devarakonda cute romance in Kushi movie:

Samantha enjoying the Bali vacation

Tags:   SAMANTHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ