టాలీవుడ్ మొత్తం శ్రీలీల పేరే జపిస్తుంది. ఏ సినిమా చూసినా శ్రీలీలే కనిపిస్తుంది. ఏ చిత్ర ఫస్ట్ లుక్ వదిలినా శ్రీలీల టాపిక్కే హైలెట్ అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె చేస్తున్న చిత్రాలు మరే హీరోయిన్ చెయ్యడం లేదు. గతంలో ఏమో కానీ.. ఈ పదేళ్ల కాలంలో శ్రీలీల మాదిరిగా వరస చిత్రాలు చేసిన వాళ్ళు కనిపించడమే లేదు. క్యూట్ లుక్స్, గ్లామర్ కి కేరాఫ్ అడ్రెస్స్ గా, నాజూకు అందాలతో అదిరిపోయే పెరఫార్మెన్స్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్.. వీటన్నిటికీ మించి అద్భుతమైన డాన్స్.. ఇవన్నీ ఆమె సొంతం.
సోషల్ మీడియాలో మరీ యాక్టీవ్ గా లేకపోయినా.. అప్పుడప్పుడు అందమైన క్యూట్ ఫొటోస్ ని వదులుతుంది. గ్లామర్ డ్రెస్ వేసినా క్లాసీగా అదరగొట్టేస్తుంది. అసలు శ్రీలీల గ్లామర్ కి ఒంక పెట్టే సందర్భం రానివ్వదు. అయితే తాజాగా శ్రీలీల కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో వదిలింది. ఆ పిక్స్ లో ఫ్లోరల్ ప్రింట్ హాఫ్ షోల్డర్ టాప్ లో కనిపించి కనువిందు చేసింది. లూజ్ హెయిర్ తో అల్లరి లుక్స్ లో శ్రీలీల కనిపించిన తీరుకి అందరూ ముగ్దులైపోతున్నారు.
వరస సినిమాలు బిజీ షెడ్యూల్స్ తో మధ్యలో మెడిసిన్ కంప్లీట్ చేసే పనిలోస్ శ్రీలీల అంత బిజీ మరెవ్వరూ ఉండరేమో. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ అండ్ యంగ్ హీరోలందరితో మ్యాగ్జిమమ్ జత కడుతుంది. ఇక ఈ చిత్రాల్లో ఏ రెండు హిట్ అయినా చరణ్, తారక్, ప్రభాస్, అల్లు అర్జున్ అవకాశాలు కూడా వచ్చిపడతాయి.