మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ ల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భోళా శంకర్ రిలీజ్ తేదీ దగ్గరపడడమే కాదు.. ప్రమోషన్స్ జోరు కూడా హుషారుగా మొదలైపోయింది. భోళా మ్యానియా అంటూ అందరితో ప్రత్యేకమైన ఆసక్తిని క్రియేట్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసారు. అందులో భాగంగానే నేడు గురువారం భోళా శంకర్ ట్రైలర్ ని రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. భోళా శంకర్ ట్రైలర్ మొత్తం కలర్ ఫుల్ గా మాస్ యాక్షన్ ఫీస్ట్ ని మెగా ఫాన్స్ కి ట్రీట్ గా అందించారు. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్ కి ఆయన యాక్షన్ ఎపిసోడ్ లో చెలరేగిపోయిన తీరుకి మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తున్నాయి.
అమ్మాయిల మిస్సింగ్ తో మొదలైన ట్రైలర్.. విలన్స్ ని మెగాస్టార్ చితక్కొట్టే సీన్స్ తో హైప్ క్రియేట్ చేసారు. అంతలోనే కామెడీ ట్రాక్‌లోకి మళ్లుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎలిమెంట్లు, చిరంజీవి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సీన్లతో ట్రైలర్ ని నింపేశారు. ట్రైలర్ మొత్తంలో మెగాస్టార్ యాక్షన్ సీన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనిపించింది. ఇక శ్రీముఖితో సీన్, మురళీశర్మతో వచ్చే సీన్‌తో పాటు చివర్లో పవన్ కళ్యాణ్ మేనరిజం హ.. అంటూ చిరు చేసిన స్టయిల్ కి పవన్ ఫాన్స్ కి అయితే మరికాస్త ఉత్సాహాన్నిచ్చింది. ట్రైలర్ మొత్తం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది.
కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా అన్ని అంశాల మేళవింపుగా ఉంది. ఇందులో చిరంజీవి చాలా యంగ్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. కీర్తి సురేష్-మెగాస్టార్ అన్న చెల్లెళ్ళ బంధాన్ని హైలెట్ చేసారు. లాయర్ గా తమన్నా, లవర్ బాయ్ పైగా సుశాంత్ కనిపించారు.