మెగా ఫ్యామిలీలోకి చిన్న కోడలిగా అడుగుపెట్టబోతున్న లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు జిమ్ లో తెగ కష్టపడుతుంది. స్వతహాగా హీరోయిన్స్ జిమ్ లో ఎక్కువగా సమయం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫిట్ నెస్ కోసం గ్లామర్ కోసం. అయితే హీరోయిన్ గా కాస్త డౌన్ ఫాల్ లో ఉన్న లావణ్య త్రిపాఠి.. ఇప్పుడు హీరో వరుణ్ తేజ్ తో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యింది. మెగాస్టార్ ఫ్యామిలీలోకి వెళ్లబోతుంది. అయినా తాను నటనకు ఎలాంటి బ్రేక్ తీసుకోవాలి, స్వస్తి చెప్పాలని అనుకోవడం లేదు అనేలా బిహేవ్ చేస్తుంది.
అందుకే తరచూ సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేస్తుంది. అప్పుడప్పుడు వరుణ్ తో వెకేషన్ కి వెళ్లిన ఫొటోస్ తో పాటుగా.. సోలో గా ఉన్న పిక్స్ షేర్ చేస్తుంది. తాను పెళ్ళయిన సినిమాలు వదలను అని చెప్పకనే చెబుతుంది. వరుణ్ తేజ్ తో వివాహమైనా తాను హీరోయిన్ గా కంటిన్యూ అవుతానని ఇలా హింట్ ఇస్తుంది. తాజాగా లావణ్య త్రిపాఠి జిమ్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. వర్కౌట్స్ చేస్తూ హుషారుగా కనిపించింది. తన ఫ్రెండ్ తో కలిసి ఉన్న పిక్ ని కూడా షేర్ చేసింది.
లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ పెళ్లి ఆగష్టు 24 న జరగబోతుంది.. దీనికి సంబందించిన ఏర్పాట్లు ఇటలీ దేశంలో జరగబోతున్నాయని తెలుస్తుంది. వరుణ్-లావణ్యలు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.