రష్మిక ఎప్పటినుండో విజయ్ దేవరకొండతో స్నేహంగా ఉంటుంది. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ అంటూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చెయ్యడంతో రష్మిక-విజయ్ దేవరకొండలు స్నేహితులయ్యారు. కానీ స్నేహానికి మించి వాళ్ళ మధ్యలో ఏదో ఉంది అనే అపోహని వారు తరుచూ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్లడం, డిన్నర్ డేటింగ్స్ అంటూ కలవడం, ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడమే ఇలా రష్మిక-విజయ్ దేవరకొండలు కలిసి కనిపిస్తూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు.
మా మధ్యన ఫ్రెండ్ షిప్ తప్ప ఇంకేం లేదు అంటూనే వారు చేస్తున్న పనులతో ఇంకేదో ఉంది అని మట్లాడుకునేలా చేస్తున్నారు. తాజాగా రష్మిక ఎయిర్ పోర్ట్ లో గళ్ళ చొక్కాతో కనిపించింది. అయితే ఇప్పుడు ఆ చొక్కా విజయ్ దేవరకొండది అంటూ రౌడీ ఫాన్స్ మాత్రమే కాదు.. చాలామంది కామెంట్ చేస్తూ పోస్ట్ లు పెట్టడమే కాదు.. ఆ చొక్కా విజయ్ దే అంటూ విజయ్ వేసుకున్న ఆ షర్ట్ పిక్ ని రష్మిక వేసుకున్న ఆ షర్ట్ పిక్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.
రష్మిక వేసుకున్న ఆ షర్ట్ కాస్త లూజ్ గా కనిపించడంతో అది విజయ్ దేవరకొండదే.. రష్మిక వేసుకుని తమ మధ్యన ఫ్రెండ్ షిప్ కాదు.. ఏదో నడుస్తుంది అని సంకేతాలిస్తుంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.