మరికొద్దిరోజుల్లో మొదలు కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 7 కి బిగ్ షాక్ తగిలింది. బిగ్ బాస్ సీజన్ 7 నుండి రీసెంట్ గా నాగార్జున ప్రోమో వదిలింది బిగ్ బాస్ యాజమాన్యం. దానికి బుల్లితెర ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాగా.. బిగ్ బాస్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగానే యంగ్ టైగర్ దానికి హోస్ట్ గా వచ్చారు. తర్వాత సీజన్ నుండి ఎన్టీఆర్ తప్పుకోగా.. రెండో సీజన్ కి నాని వచ్చారు. నానిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ రావడంతో నాని తర్వాత సీజన్ వదిలేసారు. అప్పటినుండి నాగార్జున బిగ్ బాస్ ని హ్యాండిల్ చేస్తున్నారు. గత మూడు నాలుగు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా నడిపి ఐదో సీజన్ హోస్ట్ గా మళ్ళీ తెరపై కనబడుతున్నారు.
అయితే ఎంటెర్టైమెంట్ కి అడ్డాగా బిగ్ బాస్ ని ప్రమోట్ చేస్తున్న యాజమాన్యానికి కంటెస్టెంట్స్ షాకిస్తున్నారు. అసలు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ వదిలేసి గొడవలు, రొమాన్స్, కొట్లాటలు అంటూ ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తున్నారు. గత రెండు సీజన్స్ కి టీఆర్పీ బాగా తగ్గిపోయింది. అంతేకాకుండా బయట నుండి బిగ్ బాస్ షో పై విపరీతమైన నెగెటివ్ కామెంట్స్, సిపిఐ నారాయణ బిగ్ బాస్ పై చాలాసార్లు కామెంట్ చేసారు. బిగ్ బాస్ వలన యూత్ చెడిపోతుంది అంటూ కొంతమంది బిగ్ బాస్ ని నిలిపివెయ్యాలంటూ కోర్టులో పిటిషన్ కూడా వేశారు.
ఈ కేసుపై హై కోర్టులో జరిగిన వాదనలతో హై కోర్టు బిగ్ బాస్ షో ని నిలిపివేయాలంటూ తీర్పునిచ్చింది. గతంలో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు నాగార్జునకి, బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చెయ్యాలని తెలిపింది. గతంలో కొంతమంది బిగ్ బాస్ పై పిటిషన్స్ వేసినప్పటికీ.. ఎలాంటి అడ్డంకి లేకుండా షో నడిచినా.. ఈ సీజన్ 7 విషయం ఏమవుతుందో.. కోర్టు తీర్పు ప్రకారం ఆగిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.