కార్తికేయ 2 తో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన హీరో నిఖిల్ ఆ తర్వాత అతని నుండి వస్తున్న ప్రాజెక్ట్ పై అంచనాలు ఉండడం సహజమే. దానికి తగ్గట్టుగానే స్పై అనే సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రావాలని నిఖిల్ ట్రై చేసాడు. కానీ మధ్యలో కొన్ని సమస్యల కారణం ఈ చిత్రం అనేక పర్యాయాలు రిలీజ్ తేదీలు మార్చుకుంటూ ఫైనల్ గా జూన్ 27 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు నుండి ప్యాన్ ఇండియా మూవీ అంటూ ప్రచారం చేసి చివరికి నార్త్ లో స్పై ని విడుదల చెయ్యలేక చేతులెత్తేశారు.
జూన్ 27 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని తీవ్రంగా నిరాశపరిచింది. కార్తికేయ 2 తర్వాత మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడంతో నిఖిల్ కూడా ప్యాన్ ఇండియా ప్రేక్షకులకి సారి చెప్పాడు. అయితే గత నెలలో విడుదలైన నిఖిల్ స్పై కి డిజిటల్ పార్ట్నర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంది. అయితే అసలు స్పై ఎప్పుడు ఓటిటిలోకి వస్తుందో అనే ఆసక్తి కూడా ప్రేక్షకులు చూపించలేదు.
దానికి తగ్గట్టుగానే ఎలాంటి హడావిడి, ఎలాంటి ఇంటిమేషన్ లేకుండానే అమెజాన్ ప్రైమ్ వారు స్పై ని ఓటిటిలో వదిలేసారు. నేటి నుండి అమెజాన్ ప్రైమ్ లో నిఖిల్ స్పై ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నేడు అంటే జులై 27 గురువారం నుంచి స్పై ఓటిటీ ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకి ఓటిటిలో స్పై స్ట్రీమింగ్ అవుతుంది.