Advertisementt

‘బేబీ’కి ‘నో’ చెప్పిన హీరో ఏమన్నాడంటే!

Wed 02nd Aug 2023 01:24 PM
vishwaksen,baby the movie,speculations,baby  ‘బేబీ’కి ‘నో’ చెప్పిన హీరో ఏమన్నాడంటే!
VishwakSen Clarity about He Says No To Baby ‘బేబీ’కి ‘నో’ చెప్పిన హీరో ఏమన్నాడంటే!
Advertisement
Ads by CJ

‘బేబీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓ వైపు జడివాన భయకంపితుల్ని చేస్తున్నా.. ‘బేబీ’ ముందు ఏవీ ఆగడం లేదు. కోట్లలో కలెక్షన్స్ వచ్చి పడుతూనే ఉన్నాయి. ఈ సినిమా విషయంలో అందరూ లాభాల బాటలోనే ఉన్నారు. అయితే సినిమా సక్సెస్ అలా ఉంటే.. మరోవైపు ఈ సినిమాను వదులుకున్న హీరో ఎవరంటూ.. ఈ మధ్య బాగా సెర్చింగ్ ఎక్కువైంది. చిత్ర దర్శకుడు, అలాగే అల్లు అర్జున్ వంటి హీరో కూడా ఆ హీరో గురించి కామెంట్స్ చేయడంతో.. ‘బేబీ’కి నో చెప్పిన హీరో దిగిరాక తప్పలేదు. ఆ హీరో మరెవరో కాదు మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. తను ఎందుకు ఈ సినిమాని వదులుకుందీ, ఇప్పుడొస్తున్న కామెంట్స్‌కి.. తాజాగా వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా రాకేష్ వర్రే నిర్మాతగా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పేక మేడలు’ ముఖ్య అతిథిగా హాజరైన విశ్వక్‌సేన్ ‘పేక మేడలు’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా వేదికపై వివరణ ఇచ్చిపడేశాడు.

‘‘హీరోలన్నాక కొన్ని సినిమాలతో బిజీగా ఉంటాం. ఏం చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదనే మనస్తత్వం నాది. అలాంటి సందర్భంలో కలవను, వినను అని కొందరికి చెబుతుంటాం. దీనికి కూడా కొందరు ఫీలైతే నేనేం చేయలేను. ఎందుకంటే అందరినీ హ్యాపీ చేయడానికి నేనేం బిర్యానీని కాదు. మరో విషయం ఏమిటంటే.. మన సినిమా బాగా ఆడితే.. తలెత్తుకోవాలి.. తప్పులేదు. తెలుగులో ఏ సినిమా హిట్టయినా.. ఏడ్చే వాళ్ల కంటే.. ఇండస్ట్రీకి హిట్ వచ్చిందిరా అని సంతోషించే వారే ఎక్కువ ఉంటారు. అది కూడా ఒక చిన్న సినిమాగా మొదలై.. పెద్ద హిట్టయిందంటే అందరం ఎంతో ఆనందపడుతున్నాం. 

ఈ విషయంలో ఆ సినిమా యూనిట్‌ని కంగ్రాచ్యులేట్ కూడా చేశాను. వాట్సప్‌లో డైరెక్టర్స్‌కి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో ట్రైలర్ చాలా బాగుందని మెసేజ్ చేసిన ఫస్ట్ వ్యక్తిని నేనే. సడెన్‌గా కలవలేదు.. వినలేదు అనే మీమ్స్ చూశాను. ఒకరిని పిలిచి.. వాళ్లు చెప్పేది ఓ గంట సేపు విని ‘నో’ చెప్పడం కంటే.. ముందే ‘నో’ చెప్పాలని చెప్పాను. అది నా వ్యక్తిగత విషయం. ఆ సినిమా బాగాలేదు అని కాదు. నేను చేద్దామని అనుకున్న సినిమానే. కంగ్రాచ్యులేషన్స్ ఆ సినిమాకి. కాకపోతే మన సినిమా బాగుంటే.. తలెత్తుకోవాలి తప్పులేదు. మన సినిమా బాగుందని ఎవరినీ కించపరచవద్దు.. అదొక్కటి బాధనిపించింది’’ అని విశ్వక్‌సేన్ ‘బేబీ’కి నో చెప్పిన వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

VishwakSen Clarity about He Says No To Baby:

VishwakSen indirectly reacts to speculations on him refusing to be a part of Baby The Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ