Advertisementt

దేవర ఆర్ట్ చూస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలే

Wed 26th Jul 2023 10:44 PM
devara  దేవర ఆర్ట్ చూస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలే
Devara art is a treat for NTR fans దేవర ఆర్ట్ చూస్తే ఎన్టీఆర్ ఫాన్స్ కి పూనకాలే
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో మార్చ్ లో మొదలైన ప్యాన్ ఇండియా ఫిల్మ్ దేవర మూవీ షూటింగ్ ఎండని, వానని లెక్క చెయ్యకుండా చిత్రీకరిస్తున్నారు. ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న దేవర షూటింగ్ కి సంబందించిన సెట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా షిప్, అలాగే సముద్రపు సెట్ అన్నీ వైరల్ గా మారాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి సమఉజ్జి అంటే విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపిస్తున్నారు. అయితే తాజాగా దేవర ఇలా ఉంటుంది, అందులో యాక్షన్ సీన్స్ ఇలా అనబోతున్నాయి అంటూ కొన్ని డ్రాయింగ్స్ ని ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. 

ఆ స్కెచ్ ల్లో నడి రోడ్డు మీద రక్తం ఏరులైపారుతున్నట్టుగా కనిపిస్తుంది. దాని కోసం ప్రత్యేక సెట్ వేశారంటూ, ఇళ్ల మధ్యలో భీబత్సమైన వాతావరణం దర్శనమిస్తుంది. ఆ నెత్తురు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. పోస్టర్స్ తో పాటుగా భయం వచ్చే వరకు ఆ ప్రాంతం మొత్తం అశాంతి మయం 🌊  అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. అంటే అక్కడ కొంతమంది చేసే అరాచకాలను ఆపడానికి దేవరగా భయానకంగా ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది అని దాని మీనింగ్. దేవరలో యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అంటూ ఎప్పటినుండో చెబుతున్నారు.

ప్రస్తుతం దేవరకి సంబందించిన సెట్ ఆర్ట్ అంటూ అవి వైరల్ అవుతుండగా.. నిజంగా ఆ ఆర్ట్ ఎన్టీఆర్ అభిమానులకే కాదు మాస్ ఆడియన్స్ కి కూడా పూనకాలు గ్యారెంటీ అనేలా ఉన్నాయి. ఇక ఈచిత్రంలో జాన్వీ కపూర్ జాలరి అమ్మాయిలా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇలా భారీ తారాగణం ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.

Devara art is a treat for NTR fans:

NTR Devara update

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ