Advertisementt

రశ్మికకి లక్కీ ఛాన్స్

Wed 26th Jul 2023 06:13 PM
rashmika mandanna  రశ్మికకి లక్కీ ఛాన్స్
Lucky chance for Rashmika రశ్మికకి లక్కీ ఛాన్స్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లోకి విజయ్ లాంటి హీరో సరసన ఛాన్స్ కొట్టేసి అక్కడ గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకున్న రష్మిక మందన్న కి వారసుడు బిగ్ షాక్ ఇచ్చింది. వారసుడు ఫలితం ఎలా ఉన్నా రశ్మికకి ఆ చిత్రం భారీగా నీరసాన్ని మిగిల్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో రెయిన్ బో మూవీ చేస్తుంది. అదలా ఉంటే.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే జెండా పాతడానికి ట్రై చేస్తున్న రష్మిక ఇటు సౌత్ ఆఫర్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. కొద్దిరోజుల క్రితం రష్మిక నితిన్-వెంకీ కుడుములు మూవీ నుండి ఆమె తప్పుకుందనే ప్రచారం జరిగినా.. దానిపై క్లారిటీ లేదు.

ఇప్పుడు తాజాగా శేఖర్ కమ్ములతో ధనుష్ చెయ్యబోయే ప్యాన్ ఇండియా మల్టీస్టారర్ కోసం రష్మిక పేరు పరిశీలిస్తున్నారని తెలియగానే ఆమె ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. పుష్ప పార్ట్ 1 తోశ్రీవల్లిగా పలు భాషల ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన రష్మిక ఆ తర్వాత సీతారామం వంటి ప్యాన్ ఇండియా హిట్ లో భాగమైంది. ఇక ఇప్పుడు ధనుష్ మూవీ ఛాన్స్ ఓకె అయితే గనక రష్మిక లక్కీ గర్ల్ అనే అనాలి. 

అయితే నితిన్ మూవీ నుండి డేట్స్ అడ్జెస్ట్ కాలేదని రష్మిక ఆ ప్రాజెక్ట్ నుండి బయటికెళ్లింది అనే న్యూస్ ఉంది. ఒక వేళ అదే నిజమైతే ధనుష్ మూవీ ఆ డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తుందో చూడాలి. మరి డేట్స్ అడ్జెస్ట్ చేసి ధనుష్ సరసన చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. కోలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ అవ్వడం గ్యారెంటీ.

Lucky chance for Rashmika:

Dhanush to romance Rashmika Mandanna?

Tags:   RASHMIKA MANDANNA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ