ఈమధ్యన ఉపాసన కొణిదెల హీరోయిన్ తమన్నాకి ఓ డైమండ్ రింగ్ బహుమతిగా ఇచ్చింది. ఆ డైమండ్ రింగ్ పెట్టుకునే తమన్నా ఫొటోలకి ఫోజులిచ్చింది. ఆ డైమండ్ ప్రపంచంలోనే విలువైన డైమండ్, దాని విలువ రెండు కోట్లు ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఆ ప్రచారం చూసిన జనాలైతే అసలు ఉపాసన తమన్నాకి అంత విలువైన బహుమతి ఎందుకిచ్చింది, తమన్నా ఆమెకి నిజంగా ఇంత క్లోజ్ ఫ్రెండా, నిజంగానే అది 2 కోట్ల విలువైన డైమండ్ రింగా ఇలా చాలామంది చాలా ఊహించేసుకున్నారు.
అయితే ఈ రూమర్స్ మొత్తం తమన్నా చెవిన పడినట్లుగా ఉన్నాయి. దానితో తమన్నా ఆ డైమండ్ రింగ్ రహస్యాన్ని రివీల్ చేసింది. తనకి ఎవరూ అంత కాస్ట్లీ డైమండ్ రింగ్ ఇవ్వలేదు. తన చేతి వెలికి ఉన్న రింగ్ అసలు డైమండ్ కాదని.. అది ఒక సోడా ఓపెనర్ అంటూ తమన్నా అసలు విషయాన్ని బయటపెట్టేసింది. ఈ క్లారిటీ తో ఉపాసన తమన్నాకి డైమండ్ రింగ్ ఇచ్చింది అనేది కేవలం రూమర్ అని తేలిపోయింది.
ఇదంతా చూసిన నెటిజెన్స్ అబ్బో గాసిప్ రాయుళ్లు ఎలాంటి కథలు అల్లారు. తమన్నాకి ఉపాసన విలువైన వజ్రపుటుంగరాన్ని బహుమతిగా ఇచ్చిందంట. అది తమన్నా ధరించి ఫొటోలకి ఫోజులిచ్చింది. ఏం కథలల్లార్రా బాబు.. ఆహా ఉపాసన-తమన్నా ఓ డైమండ్ రింగ్ అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.