కొణిదెల ఆడపడుచు నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోతుంది అని గత మూడు నెలలుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ చైతూతో తాను విడిపోతున్నట్టుగా, విడాకులు తీసుకుంటున్నట్టుగా కన్ ఫర్మ్ చేసింది, కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో నిహారిక ఆమె భర్త చైతన్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న పేపర్స్ బయటపడడంతో నిహారిక ఓపెన్ అయ్యింది. అంతకుముందే చైతన్య జొన్నలగడ్డ యోగ జీవితం బాధలను దూరం చేస్తుంది అంటూ ఈ విడాకులపై ఇండైరెక్ట్ గా స్పందించాడు.
ఇక నిహారిక మేము విడాకులు తీసుకుంటున్నాము, నేను చైతన్య ఇకపై విడిగా ఉంటాము, మమ్మల్ని ప్రశాతంగా ఉండనివ్వండి, మాకు ప్రయివసీ కావాలంటూ పోస్ట్ పెట్టింది. విడాకులు విషయంపై స్పందించక ముందే నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా మారింది. ఫ్రెండ్స్ తో కలిసి హడావిడి చేస్తుంది. విడాకుల తర్వాత మరింత యాక్టీవ్ గా జిమ్ వీడియోస్ ని షేర్ చేస్తుంది. అయితే విడాకులు అయ్యాయి అని తెలిసాక చైతన్య జొన్నలగడ్డ నుండి ఎలాంటి పోస్ట్ కానీ, ఎలాంటి స్పందన కానీ బయటికి రాలేదు.
నిహారిక తో విడాకులయ్యాక మొదటిసారిగా అతని సోషల్ మీడియా హ్యాండిల్ నుండి ఒక ఫోటో వదులుతూ.. ఆల్ త్రీస్ ఇన్ స్మైల్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. సింగిల్ గా చైర్ లో రిలాక్స్డ్ గా కనిపించిన చైతన్య.. ఈ విడాకుల బాధనుండి పూర్తిగా కోలుకున్నాడు అనిపించేలా కనిపించాడు.