టీడీపీని గద్దెనెక్కించేందుకు అలాగే చంద్రబాబు నాయుడు కొడుకు అనే ట్యాగ్ నుంచి బయటపడి తనని తాను నిరూపించుకోవడానికి నారా లోకేష్ దాదాపుగా 165 రోజులుగా ఏపీలో పాద యాత్ర నిర్వహిస్తున్నారు. ఎండనక, వాననకా లోకేష్ ప్రజలతో మమేకమవుతున్నారు. అదే పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకి చేరువవుతున్నారు. కొద్దిరోజుల క్రితమే టీడీపీ కి సపోర్ట్ గా నారా రోహిత్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాకుండా ఇప్పుడు అన్న లోకేష్ కి సపోర్ట్ గా ఓ సినిమా చేస్తున్నాడు రోహిత్.
అదే టీడీపీకి వీరాభిమాని TV5 మూర్తి దర్శకత్వంలో ప్రతినిధి2 అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా ఏళ్లుగా సినిమాల్లో కనబడని నారా రోహిత్.. మళ్లీ ఎన్నికల ముందు ప్రతినిధి2 అనే చిత్రంతో రాబోతున్నాడు. నారా రోహిత్ బర్త్ డే కి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదిలారు. ఈ ప్రతినిధి 2 ఖచ్చితంగా వైసీపీ కి వ్యతిరేఖంగా, టీడీపీకి అనుకూలంగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. దర్శకుడిగా TV5 మూర్తి ఖచ్చితంగా ఈ సినిమా కోసం పవర్ ఫుల్ పొలిటికల్ డైలాగ్స్ రాసే ఉంటాడు.. అవి నారా రోహిత్ నోటి వెంట పలికించడమూ ఖాయమే అంటున్నారు.
నారా రోహిత్ అన్న లోకేష్ కోసమే ఇన్నాళ్ళకి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అసలు పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాకా సినిమాలవైపు చూడని నారా రోహిత్ ఇలా ఏపీ ఎలక్షన్స్ ముందే ప్రతినిధి 2 తో రావడం కాకతాళీయమా అనేది మాత్రం కన్ఫ్యూజన్ అవసరం లేని ప్రశ్న అంటూ చాలామంది భావిస్తున్నారు. అన్న కోసమే ఈ తమ్ముడు సినిమా అన్నమాట.