నిన్న మంగళవారం ఈవెనింగ్ హైదరాబాద్ లో శిల్ప కళా వేదికలో పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన BRO ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిగింది. వైష్ణవ్ తేజ్-వరుణ్ తేజ్ అతిధులుగా ఆ ఈవెంట్ లో కనిపించగా అందరిలో స్పెషల్ ఎట్రాక్షన్ గా పవన్ కళ్యాణ్ మాత్రమే కనిపించారు, ఎవరెన్ని మాట్లాడినా పవన్ స్పీచ్ అక్కడ హైలెట్ అయ్యింది. హీరోయిన్స్ కూడా శారీస్ లోనే అందంగా అందాలు ఆరబోశారు. వారి గ్లామర్ కూడా చాలా స్పెషల్ గా కనిపించింది.
అయితే ఇంత గ్రాండ్ గా గ్లామర్ గా జరిగిన BRO ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెయిన్ గా కనిపించాల్సిన ఇద్దరు మిస్ అయ్యారు. వారే బ్రో మూవీకి కర్త, కర్మ, క్రియ అయిన త్రివిక్రమ్, మరొకరు కమెడియన్ బండ్ల గణేష్ లు. పవన్ కళ్యాణ్ బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చేప్పారు. త్రివిక్రమ్ నాకు ఫోన్ చేసి సముద్రఖని కథ చెప్పారు, నేను మూవీ చూడలేదు. ఈ రీమేక్ చేస్తే బావుంటుంది అని. ఆయన చెప్పబట్టే నేను బ్రో చెయ్యడానికి ఒప్పుకున్నాను అని. అలాంటి త్రివిక్రమ్ బ్రో ఈవెంట్ లో కనిపించకపోయేసరికి ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు.
అలాగే దేవర, దేవుడు అంటూ పవన్ కళ్యాణ్ ని నిత్యం పూజించే బండ్ల గణేష్ ఈ ఈవెంట్ లో కనిపిస్తాడని అనుకున్నారు. ఈ ఈవెంట్ లో బండ్లన్న స్పీచ్ వినాలన్న వారిలో కొద్దిగా నిరాశ తొణికిసలాడింది. బండ్ల గణేష్ వచ్చి స్టేజ్ పై పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతూ ఇచ్చే స్పీచ్ కి ఫాన్స్ చప్పట్లు కొట్టేవారు, పవన్ కూడా సరదాగా నవ్వుకునేవారు. మరి బ్రో ఈవెంట్ లో ఉండాల్సిన త్రివిక్రమ్, బండ్ల గణేష్ లు ఎందుకు కనిపించలేదు.. కానీ వీరి రాక కోసం చాలామంది అయితే ఎదురు చూసారు.