‘భోళాశంకర్’ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు దర్శకులతో సినిమాకు ఓకే చెప్పినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అందులో ఒకరు ‘సోగ్గాడే చిన్నినాయన’ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. రెండో దర్శకుడు ‘బింజిసార’తో సెన్సేషనల్ హిట్ అందుకున్న వశిష్ట. ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న మెగాస్టార్.. రాబోయే తన బర్త్‌డేకి ఈ ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించి.. ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేయాలని చూస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. అయితే ఈ మధ్యలో ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని మెగాస్టార్ తనయ సుస్మిత కొణిదెల నిర్మించనుందనేలా వార్తలు వస్తున్న తరుణంలో మరో బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో యాడ్ కాబోతోందనేలా వదంతులు బయటికి వచ్చాయి.
ఈ వదంతులపై తాజాగా ఆ బ్యానర్ వివరణ ఇచ్చింది. సుస్మిత తన గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా.. వెనుక టాప్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సపోర్ట్ ఉన్నట్లుగా టాక్ బయటికి రావడంతో.. వెంటనే ఆ సంస్థ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యానర్ నిర్మాత విశ్వప్రసాద్ ఈ మధ్య ‘బ్రో’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవిగారంటే ఎంతో ఇష్టమని, ఆయనతో సినిమా చేయడం తను ఎంతో గౌరవంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. ఇప్పుడొస్తున్న వార్తలతో ఆయన హర్టయ్యారు. వెంటనే వివరణ ఇస్తూ..
‘మెగాస్టార్ చిరంజీవిగారితో సినిమా చేయడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడూ చాలా సంతోషంగా ముందుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు కేవలం రూమర్స్ మాత్రమే. పూర్తిగా ఊహాజనితాలు.. అందులో ఎటువంటి నిజం లేదు’ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తరపున అధికారికంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే వారిచ్చిన వివరణ ప్రకారం.. త్వరలోనే ఈ టాప్ బ్యానర్‌లో మెగాస్టార్‌తో సినిమా ఉండే అవకాశాలైతే స్పష్టంగా కనబడుతున్నాయి.