ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో ఇద్దరు సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ నువ్వా-నేనా అని పోటీ పడ్డారు. ఈ రెండు చిత్రాల్లో కామన్ గా కనిపించిన అంశం హీరోయిన్ శృతి హాసన్. చిరు సరసన, బాలయ్య సరసన కనిపించిన శృతి హాసన్ ఆయా పాత్రల్లో ఆకట్టుకుంది. వీరసింహరెడ్డి-వాల్తేర్ వీరయ్య ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో విడుదలై విజయాన్ని సాధించాయి. ఈ రెండు చిత్రాల విజయాల్లో శృతి హాసన్ కి భాగం దక్కింది. దానితో శృతిని లక్కీ చార్మ్ అంటూ పొగిడేశారు.
ఇప్పుడు అదే ఫీట్ రిపీట్ చేసి కాంప్లిమెంట్స్ కొట్టేసే ఛాన్స్ తమన్నాకి వచ్చింది. సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి-రజినీకాంత్ ఆగష్టులో బాక్సాఫీసు వద్ద బాహాబాహీకి సిద్ధపడితే ఇటు చిరు సరసన, అటు రజిని సరసన తానే కనిపించబోతుంది తమన్నా. ఒకవైపు మెగాస్టార్ తో మిల్కి బ్యూటీ అని పొగిడించుకునే పాటతోను మరోవైపు సూపర్ స్టార్ ని నువ్ కావాలయ్యా అంటూ కవ్వించే పాటతోను ఆ రెండు చిత్రాలకి తన గ్లామర్ తో మంచి హైప్ తెచ్చింది తమన్నా. ఇంకా ముఖ్యమైన విశేషమేమిటంటే అప్పట్లానే ఇప్పుడు కూడా భోళా శంకర్, జైలర్ ఈ రెండు చిత్రాలు కూడా ఒక్క రోజు గ్యాప్ లోనే విడుదలకు రెడీ అయ్యాయి. ఆగష్టు 10 న జైలర్, ఆగష్టు 11 న భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి శృతి హాసన్ అందుకున్న ఆ రేర్ ఫీట్ తమన్నా కూడా సాధిస్తుందా.. అనేది వేచి చూడాల్సిందే.
అన్నట్టు మరో విధంగా కూడా తమన్నాకి ఇది టఫ్ టెస్ట్. ఇన్నేళ్ళ తన కెరీర్ లో ఎంతో గ్లామరస్ గా కనిపించినప్పటికీ హద్దుల్లోనే ఉన్న తమన్నా ఈ మధ్య చేసిన వెబ్ కంటెంట్ లో మాత్రం మరీ బరితెగించేసిందనే విమర్శలు ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్స్ అండ్ కెరీర్ క్లోజింగ్ దిశగా పడుతున్న స్టెప్స్ ఆగాలన్నా, మరో మలుపు తిరగాలన్నా తమన్నాకి ఓ విజయం తప్పనిసరి. మరా హిట్ ని తమన్నా పట్టేస్తుందా.. లేక బ్యాడ్ లక్ తనని వెనక్కి నెట్టేస్తుందా..!