Advertisementt

బిగ్ బాస్7 లోకి కార్తీక దీపం విలన్

Tue 25th Jul 2023 09:15 AM
bigg boss  బిగ్ బాస్7 లోకి కార్తీక దీపం విలన్
Karthika Deepam Monitha in Bigg Boss 7 బిగ్ బాస్7 లోకి కార్తీక దీపం విలన్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించిన చర్చలే. కారణం బిగ్ బాస్ ప్రోమో తో నాగార్జున అప్పుడే సందడి మొదలు పెట్టడమే.. ఈ సీజన్ 7 హౌస్ లోకి వాళ్ళు వెళుతున్నారు, వీళ్ళు వెళుతున్నారంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. స్టార్ మా లో పని చేసే చాలామంది బిగ్ బాస్ హౌస్ లో కనిపించే ఛాన్స్ ఈసారి ఎక్కువగా కనబడుతుంది. అందులో జానకి కలగనలేదు సీరియల్ నటుడు అమరదీప్ ఆయన భార్య కేరాఫ్ అనసూయ నటి కన్ ఫర్మ్ అయినట్లుగా వార్తలు రావడం, ఆ వెంటనే జబర్దస్త్ నుండి ఈసారి గ్లామర్ భామ వర్ష బిగ్ బాస్ ఎంట్రీకి రెడీ అయ్యింది అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది..

మరోపక్క ఈటివి ప్రభాకర్ కూడా హౌస్ లోకి వెళ్లబోతుంటే.. ఇప్పుడు కార్తీక దీపంలో విలన్ గా తెగ ఫేమస్ అయిన మోనిత బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో విలన్ గా మోనితని చూస్తే భయపడేవారు. అలాగే ఆమె అవుట్ ఫిట్స్ కి ఫిదా అయ్యే వారు. గ్లామర్ గా కనిపించే మోనిత విలన్ గా విశ్వరూపం చూపించింది. ఈ విషయమై బిగ్ బాస్ 7 టీమ్ కూడా స్పష్టత ఇచ్చారంటున్నారు. దానితో మోనిత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే హౌస్ మేట్స్ తో రోజు గొడవలేనేమో అంటూ నెటిజెన్స్ కూడా సరదాగా కామెంట్ చేస్తున్నారు. మోనిత గ్లామర్ బిగ్ బాస్ కి హెల్ప్ అవుతుంది అని ఆమెకి భారీ పారితోషకం కూడా ఆఫర్ చేశారట.

ఇక ఈ సీజన్ ని యాజమాన్యం సెప్టెంబర్ నుండి కాకుండా ఆగష్టు నుండే మొదలు పెట్టబోతోంది. ఆగష్టు మొదటి వారం కానీ, రెండో వారం నుండి కానీ సీజన్ 7 ని మొదలు పెట్టే ఆలోచనలో యాజమాన్యం ఉంది అని, ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తవడమే కాదు.. అన్నపూర్ణ స్టూడియోస్ లో అప్పుడే బిగ్ బాస్ హౌస్7 సెట్ కూడా రెడీ అవుతుంది.

Karthika Deepam Monitha in Bigg Boss 7:

Bigg Boss Telugu 7 Season Team Confirms Karthika Deepam Serial Actress Shobha Shetty

Tags:   BIGG BOSS
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ