Advertisementt

OG పై క్రేజీ న్యూస్

Tue 25th Jul 2023 08:40 AM
pawan kalyan  OG పై క్రేజీ న్యూస్
Crazy news on OG OG పై క్రేజీ న్యూస్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న OG మూవీ షూటింగ్ పవన్ కళ్యాణ్ లేకపోయినా.. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మిగతా నటులతో జరుగుతూనే ఉంది. సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ప్యాన్ ఇండియా స్టయిల్లోనే విడుదల కావడం పక్కా అని ఈ ప్రాజెక్ట్ లోకి అమితాబ్ ఎంట్రీతోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ స్టయిల్ లో కనిపిస్తారనే ప్రచారంతో పవన్ ఫాన్స్ అయితే ఫుల్ గా ఖుషి అవుతున్నారు.

అయితే వరస షెడ్యూల్స్ తో గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుకుంటున్న OG చిత్రాన్ని ఎలాగైనా ఈ డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారు.. ఏపీ ఎన్నికల ముందే ఈ చిత్రం రిలీజ్ చేస్తే బావుంటుంది అందుకే డిసెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్ అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వలన ఈ రిలీజ్ డేట్ కాస్త ఆలస్యమయ్యేలా  కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా మారుతూ ఉండడంతో OG ని వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. అయితే వచ్చే ఏప్రిల్ లో ఏపీ ఎన్నికల నగారా మోగబోతుంది అని తెలుస్తోంది.

ఈలోపులోనే దానయ్య OG ని రిలీజ్ చేసే ప్లాన్ లో కనబడుతున్నారు. పవన్ కళ్యాణ్ గనక కాస్త కోపరేట్ చేస్త మోస్ట్లీ ఈ చిత్రం డిసెంబర్ లోనే ఉటుంది. ఆయన డేట్స్ దొరకడం కష్టమైతే గనక వచ్చే సమ్మర్ కి OG షిఫ్ట్ అవుతుంది. ఈ డేట్ విషయంపై మేకర్స్ చర్చించి త్వరలోనే ప్రకటన ఇస్తారని సమాచారం.

Crazy news on OG:

Crazy news on Pawan Kalyan OG

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ