పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల కాంబోలో సముద్రఖని తెరకెక్కించిన BRO మూవీ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చిన్న సినిమాలు హడావిడి నడుస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ BRO భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమాగా ఆడియన్స్ ని ఆకర్షిస్తుంది. పవన్ కళ్యాణ్ గాడ్ గా కనిపిస్తున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు మంగళవారం శిల్పకళా వేదికలో జరగబోతుంది. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ BRO షూటింగ్ ఎంత నిష్ఠతో చేసారో అనేది ఆ చిత్ర దర్శకుడు సముద్రఖని మాటల్లో..
పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, ఆయన వెంటనే షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే పవన్ షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే BRO షూటింగ్ స్టార్ట్ చేశాం.పవన్ సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. గాడ్ కేరెక్టర్ లో కనిపించబోతున్న పవన్ కళ్యాణ్ BRO షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు.. ఎంతో నిష్ఠతో పనిచేశారు.. అంటూ సముద్రఖని BRO ఇంటర్వ్యూలో తెలియజేసారు.