Advertisementt

బేబీ ఓటిటీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్

Mon 24th Jul 2023 04:06 PM
baby  బేబీ ఓటిటీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
Bad News For Baby Fans బేబీ ఓటిటీ లవర్స్ కి బ్యాడ్ న్యూస్
Advertisement
Ads by CJ

జులై 14 న విడుదలైన చిన్న సినిమా బేబీ కలెక్షన్స్ పరంగా ప్రభంజనం సృష్టిస్తుంది. ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ అశ్విన్ కలయికలో సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ మూవీని గీతా ఆర్ట్స్ సభ్యుడు SKN నిర్మించాడు. సోలో నిర్మాతగా SKN బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. రెండో వారంలోను బేబీ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ఎలాంటి సినిమా అయినా మొదటి వారానికే సైలెంట్ అవుతున్న తరుణంలో బేబీ మూవీ రెండో వారంలోనూ తగ్గేదేలే అంటుంది. 

సెకండ్ వీక్ లో బేబీకి పోటీ ఇచ్చే సినిమా లేకపోవడంతో కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. అయితే హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా మూడు నాలుగు వారాల్లోనే ఓటిటికి వచ్చేస్తున్న రోజులివి. కానీ SKN మాత్రం బేబీని ఇప్పుడప్పుడే ఓటిటిలోకి వదిలే ప్రోగ్రాం పెట్టుకోడం లేదు అని తెలుస్తుంది. ఇంకా నిలకడగా కల్లెక్షన్స్ సాధిస్తున్న బేబీ మూవీని మూడు, నాలుగు వారాలకే ఓటిటిలో వదలడం లేదు అని, ఆ ఆమేరకు బేబీ ఓటిటి పార్ట్నర్ ఆహా వారితో SKN చర్చలు జరిపినట్లుగా వార్తలొస్తున్నాయి.

అందుకే బేబీ ని ఆగష్టు చివరి వారంలో కానీ, లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో కానీ ఓటిటి లో రిలీజ్ చేసేట్లుగా ఆహాతో మాట్లాడారట, బేబీ ఓటిటి ప్రియులకి బ్యాడ్ న్యూస్ అనేది అందుకే. అంటే బేబీ ని ఓటిటి లో వీక్షించాలంటే మరో నెల వెయిట్ చెయ్యాల్సిందే అన్నమాట.

Bad News For Baby Fans:

Baby OTT Release Date Pushed Further

Tags:   BABY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ