మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు ని విడుదలకి సిద్ధం చేస్తున్నాడు. దసరా బరిలో నిలవబోతున్న టైగర్ నాగేశ్వర రావు తర్వాత రవితేజ నుండి.. ఈగల్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్లాపులు, సక్సెస్ లతో సంబంధం లేకుండా వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండే హీరో రవితేజ. ఈ రెండు చిత్రాలే కాకుండా రవితేజ తనకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన గోపిచంద్ మలినేనితో మరో ప్రాజెక్ట్ ని మైత్రి మూవీస్ బ్యానర్ లో అనౌన్స్ చేసాడు.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే రవితేజకి జోడిగా హీరోయిన్ ని సెట్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్ గా మరింది. రవితేజ తో మొదటిసారి పూజ హెగ్డే నటించబోతుంది అంటూ ఓ వార్త చక్కర్లు కొట్టడమేనా.. సెంటిమెంట్ కి కేరాఫ్ గా ఉన్న శృతి హాసన్ ని గోపీచంద్ మలినేని పక్కనబెట్టాడనే న్యూస్ మొదలయ్యింది. క్రాక్, వీరసింహారెడ్డిలలో శృతి హాసన్ ని రిపీట్ చేసిన గోపీచంద్ పూజ హెగ్డేని రవితేజ కోసం దించబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఈమధ్యన గుంటూరు కారం నుండి పూజాని తప్పించారనే వార్త నడుస్తున్న సమయంలో రవితేజ ఆఫర్ గనక తగిలితే పూజకి కాస్త ఊరట లభించినట్లే. మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాలు త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.