పవన్ కళ్యాణ్ వెంకటేష్ మూవీ గోపాల గోపాల లో గెస్ట్ కేరెక్టర్ అంటూనే మోడ్రెన్ గాడ్ గా సినిమాలో చాలా వరకు కనిపించారు. ఓన్లీ వెంకీ కి మాత్రమే కనిపిస్తూ.. మిగతావారికి కనిపించకుండా సినిమాని నడిపించారు. అది బాలీవుడ్ మూవీ రీమేక్. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నుండి మరో రీమేక్ రాబోతుంది. జులై 28 న బ్రో అంటూ సాయి ధరమ్ తేజ్ తో కలిసి రాబోతున్నారు. అయితే బ్రో ట్రైలర్ చూసాక చాలామంది పవన్ కళ్యాణ్ ఏంటి గోపాల గోపాల లో వేసిన కేరెక్టర్ మళ్ళీ BRO లో వేస్తున్నారంటూ సాగదీస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ గోపాల గోపాల కాన్సెప్ట్ రెండూ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సాయి ధరమ్ తేజ్ పక్కనే బ్రో గా ఉంటూ సినిమాని నడిపించిన తీరుతో అందరూ గోపాల్ గోపాల్ కి మోడ్రెన్ వేషంలా ఉంది అంటున్నారు. మరి సినిమా మొత్తం చూసాక కానీ దానిపై స్పష్టత రాదు. పవన్ కళ్యాణ్ కేరెక్టర్ చూసి గోపాల గోపాల - BRO మూవీస్ లుక్స్ వైజ్ గా ఒకేలా ఉన్నాయంటున్నారు. అక్కడ పిల్లనగ్రోవి, ఇక్కడ గిటార్ అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ.. అక్కడ వెంకీకి తోడు, ఇక్కడ BRO లో సాయి ధరమ్ కి తోడు కేరెక్టర్ మాత్రం ఒక్కటే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చెయ్యడంతో పవన్ ఫాన్స్ లో ఒకరకమయిన ఆందోళన మొదలయ్యింది.