సమంత సినిమాలకి మాత్రమే గ్యాప్ ఇచ్చింది సోషల్ మీడియాకి కాదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే సమంత ప్రస్తుతం షూటింగ్స్ నుండి లాంగ్ బ్రేక్ తీసుకోబోతుంది. మానసిక ప్రశాంతత, యోగ అలాగే తన మాయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అమెరికా ప్రయాణమంటూ హడావిడి పడుతుంది. అంత బిజిలోనూ సమంత సోషల్ మీడియాలో వీడియోస్, ఫొటోస్ షేర్ చెయ్యడం మాత్రం మనలేదు. తాజాగా గ్లామరస్ వీడియోస్ ఒకటి షేర్ చేసింది. ప్రస్తుతం సమంత బ్యూటిఫుల్ వీడియో చూసి అందరూ ఫిదా అవుతున్నారు.
అది చూసిన నెటిజెన్స్ సమంత సినిమా షూటింగ్స్ కి మాత్రమే గ్యాప్ ఇచ్చింది, సోషల్ మీడియాకి కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో లో బాబ్డ్ హెయిర్ స్టయిల్ తో సమంత గ్లామర్ గా అదరగొట్టేసింది. స్టయిల్ గా గాలికి ఎగురుతున్న కురులని అటు ఇటు ఆడిస్తూ స్లో మోషన్ లో తీసిన వీడియో అది. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషి మూవీలో చేసిన రొమాంటిక్ సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అటు హిందీలో సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేసి ఆధ్యాత్మికత బాట పట్టింది. గుడులు గోపురాలు, యోగ ఇలా సమంత నిత్యం సోషల్ మీడియాలోనే దర్శనమిస్తుంది.
ఇక సమంత త్వరలోనే అమెరికా ప్రయాణం పెట్టుకోబోతుంది. అక్కడే ఆమె ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి ఇండియాకి వస్తుంది అని తెలుస్తుంది. ఒక ఏడాది పాటు సమంత ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోదనే ప్రచారం కూడా జరుగుతుంది.