కింగ్ నాగార్జున ఆట మొదలు పెట్టేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుండి బిగ్ బాస్ కో హోస్ట్ గా మారిన నాగార్జున ఇప్పుడు సీజన్ 7 కి కూడా ఆయనే వ్యాఖ్యాతగా రాబోతుంది. ఇప్పటికే సీజన్ 7 ప్రోమో వదలగా అది బాగా వైరల్ అయ్యింది. అయితే గత రెండు సీజన్స్ కాస్త డల్ గానే నడిచాయి. హౌస్ లో కొట్లాటలు, టాస్క్ ల్లో పోటీలు తప్ప.. ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గింది అనే కంప్లైంట్స్ వస్తున్నాయి. హోస్ట్ నాగార్జున మాత్రం ఈసారి సీజన్ లో ఆట కొత్తగా ఉండబోతుంది అంటున్నారు.
తాజాగా బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ పేరుతో గత ఆరు సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో కలిపి ఓ షో మొదలు పెట్టింది స్టార్ మా యాజమాన్యం. సుమ యాంకర్ గా ఈ షో ఉండబోతుంది. బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ ప్రోమో వదిలారు. అందులో నాగార్జున కూడా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమోలో నాగార్జున కుడి ఎడమైతే పొరబాటు లేదో అంటూ సాంగ్ పాడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ సాంగ్ కి అర్ధం ఏమిటో చెప్పమని సుమ బిగ్ బాస్ షైనింగ్ స్టార్స్ ప్రోమోలో అడిగింది.
దానికి నాగార్జున సమాధానమిస్తూ.. న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూ రూల్స్ అంటూ బిగ్ బాస్ సీజన్ 7 పై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసారు. అంటే ఈసారి సీజన్ 7 లో సరికొత్తగా గేమ్స్ ప్లాన్ చెయ్యడం, ఎంటర్టైన్మెంట్ కూడా తారా స్థాయిలో ఉండబోతుంది అనేది మాత్రం పక్కాగానే కనబడుతుంది. ఇక ఈ సీజన్ కోసం సెప్టెంబర్ వరకు వెయిట్ చెయ్యక్కర్లేదు అని, ఆగష్టు నుండే సీజన్ 7 వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది.