ఈమధ్యనే కోలీవుడ్ లో మామన్నన్ తో హిట్ కొట్టిన కీర్తి సురేష్ సోషల్ మీడియాలో బాగా హడావిడి చేస్తుంది. నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ వదులుతుంది. గ్లామర్ గా కనిపిస్తూ అందాలు ఆరబోత మొదలు పెట్టింది. తాజాగా కీర్తి సురేష్ వదిలిన ఎల్లో అవుట్ ఫిట్ షూట్ వైరల్ గా మారింది. ఎల్లో కలర్ చుడిదార్ లో కీర్తి సురేష్ సూపర్ ట్రెడిషనల్ గా కనిపించింది. లైట్ కలర్ డ్రెస్ లో కీర్తి సురేష్ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. మొహంలో గ్లో కొట్టొచ్చినట్టుగా ఉంది. గతంలో సన్నబడి బరువు తగ్గే ప్రాసెస్ లో ఫేస్ లో గ్లో కోల్పోయింది.
మళ్ళీ ఇప్పుడు కీర్తి సురేష్ లో మునుపుటి అందాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రెడీగా ఉంది. మెగాస్టార్ కి సిస్టర్ గా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఈ చిత్రంలోను కీర్తి సురేష్ లుక్స్ సాంప్రదాయక పద్దతిలోనే కనిపించబోతుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ సాంఘీక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.