Advertisementt

తెరపై ఎలా కనిపించడానికైనా ఓకే.. కానీ?

Wed 02nd Aug 2023 08:42 AM
ruhani sharma,heroine,her movie,bold scenes  తెరపై ఎలా కనిపించడానికైనా ఓకే.. కానీ?
Ruhani Sharma about Bold Scenes తెరపై ఎలా కనిపించడానికైనా ఓకే.. కానీ?
Advertisement
Ads by CJ

తెరపై ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా నేను సిద్ధమే కానీ.. అది సినిమాకు, ఆ సినిమా కథకు అవసరమై ఉండాలంటోంది.. హీరోయిన్ రుహానీ శర్మ. ‘చిలసౌ’ సినిమాతో లక్షణంగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ తర్వాత ‘హిట్’ రూపంలో విజయాన్ని అందుకుంది కానీ.. హీరోయిన్‌గా సరైన గుర్తింపును మాత్రం పొందలేకపోతోంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇలా అనేక భాషల్లో అవకాశాలైతే వస్తున్నాయి కానీ.. స్టార్ స్టేటస్ మాత్రం ఆమె దరికి చేరడం లేదు. పోని గ్లామర్ పరంగా ఏదైనా ప్రాబ్లమా అంటే.. అలాంటిదేమీ లేదు అన్నట్లుగానే సోషల్ మీడియాలో సైతం హాట్ హాట్‌గా దర్శనమిస్తుంటుంది. మరెందుకు ఆమెకు స్టార్ స్టేటస్ రావడం లేదనేది ఆమె మాటల్లోనే..

నేను ఎక్కువగా కాన్సెఫ్ట్ ఓరియంటెడ్ చిత్రాలకే ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు అలాంటి కథలంటేనే ఇష్టం. అందుకే నేను సెలక్ట్ చేసుకునే చిత్రాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కథలు కూడా అలాంటివే. కమర్షియల్ అవకాశాలు నాకు కూడా వచ్చాయి. కానీ వాటిలో నటించలేదు. ఎందుకు నటించలేదనే బాధ నాకు లేదు.. రాదు కూడా. అలా అని నేనేదో బోల్డ్‌గా నటించడానికి భయపడతానని అనుకుంటారేమో.. అలాంటిదేమీ లేదు. తెరపై ఎలాంటి సన్నివేశంలో నటించడానికైనా నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. కానీ ఆ బోల్డ్ సన్నివేశం సినిమాకు, ఆ సినిమా కథకు ఎంత అవసరం అనేది నాకు ముఖ్యం. నేను సినిమా అంగీకరించడానికి కథ ఒక్కటే సరిపోదు. 

ఎటువంటి సినిమాలో నేను నటిస్తున్నాను? ఇందులో ఎవరెవరితో నేను కలిసి వర్క్ చేయబోతున్నాను. ఈ సినిమా స్థాయి ఏంటి? ఈ సినిమాతో దర్శకుడు చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి? అనే కోణంలో నేను ఆలోచిస్తాను. అందుకే కొన్ని సినిమాలు చేయకుండా వదిలేశాను. నేను వదిలేసిన సినిమాలు హిట్టయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ.. నేనెప్పుడూ బాధపడలేదు.. అని రుహానీ శర్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన Her అనే చిత్రం విడుదలై మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రుహానీ పాత్రకు, నటనకు మంచి పేరొస్తోంది.

Ruhani Sharma about Bold Scenes:

Ruhani Sharma Ready to Do any Role.. But 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ