Advertisementt

నితిన్ 32 టైటిల్ రివీల్డ్

Sun 23rd Jul 2023 05:21 PM
nithiin  నితిన్ 32 టైటిల్ రివీల్డ్
Nithiin Film titled as EXTRA నితిన్ 32 టైటిల్ రివీల్డ్
Advertisement
Ads by CJ

నితిన్ క‌థానాయకుడిగా రూపొందుతోన్న 32వ చిత్రానికి ఎక్స్‌ట్రా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఆర్డిన‌రీ మేన్‌ ట్యాగ్ లైన్‌. రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రానున్న ఈ చిత్రం ఇప్ప‌టికే 60 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. హ్యాపినింగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

ఈ సినిమా చిత్రీక‌రణ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఆదివారం ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.డిఫ‌రెంట్‌గా ఉన్న‌ ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. పోస్ట‌ర్‌లో నితిన్ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో క‌నిపిస్తున్నారు. ఓ దానిలో ఆయ‌న హెయిర్ స్టైల్‌, గ‌డ్డంతో సీరియ‌స్‌గా క‌నిపిస్తున్నారు. అదే పోస్ట‌ర్‌లో మ‌రో లుక్‌లో గ‌డ్డం లేకుండా  చాలా కూల్‌గా క‌నిపిస్తున్నారు నితిన్‌. 

పోస్ట‌ర్ బ్యాగ్రౌండ్‌లో ఓ స‌న్నివేశానికి సంబంధించిన స్క్రిప్ట్ క‌నిపిస్తుంది. అలాగే క్లాప్ బోర్డ్ కూడా క‌నిపిస్తుంది. నితిన్ లుక్ చాలా కొత్త‌గా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఎక్స్‌ట్రా అనే టైటిల్‌తో పాటు ఆర్డిన‌రీ మేన్‌ అనే ట్యాగ్ లైన్ పోస్ట‌ర్‌లో మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది. నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నార‌ని క్లియ‌ర్‌గా తెలుస్తోంది.ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. హ‌రీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ ఎక్స్‌ట్రా` క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుంది అన్నారు. 

Nithiin Film titled as EXTRA :

Nithiin, Vakkantham Vamsi Film titled as EXTRA and the first look is Extraordinary

Tags:   NITHIIN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ