Advertisementt

బాలీవుడ్ పై జెనీలియా సెన్సేషనల్ కామెంట్స్

Sun 23rd Jul 2023 10:42 AM
genelia  బాలీవుడ్ పై జెనీలియా సెన్సేషనల్ కామెంట్స్
Genelia Sensational Comments on Bollywood బాలీవుడ్ పై జెనీలియా సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఢీ, రెడీ, బొమ్మరిల్లు, ఎన్టీఆర్ నా అల్లుడు ఇలా తెలుగులో పాపులర్ హీరోయిన్ గా కొన్నాళ్ళు కనిపించిన జెనీలియాకి రామ్ చరణ్ ఆరెంజ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలు, పొలిటికల్ ఫ్యామిలీ అవడంతో జెనీలియా నటనకు దూరమయ్యింది అనుకున్నారు. అయితే పిల్లలు కాస్త పెరగడంతో జెనీలియా మళ్ళీ నటనకి రీ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో సమంత-నాగ చైతన్య కలయికలో తెరకెక్కి హిట్ అయిన మజిలీ మూవీని జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ లు రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇకపై నటనకు దగ్గరగా ఉండబోతున్నట్టుగా చెప్పిన జెనీలియా బాలీవుడ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను సౌత్ లో మూవీస్ చేస్తున్నప్పుడు తనని బాలీవుడ్  ఇండస్ట్రీ పక్కనపెట్టేసింది, సౌత్ సినిమాలు చేసుకుంటున్నావ్ గా అక్కడికే వెళ్ళు అంటూ బాలీవుడ్ దర్శకనిర్మాతలు అన్నట్టుగా జెనీలియా చెప్పుకొచ్చింది. 

అసలు తనకి నటనపైన ఇంత ఇష్టం పెరగడానికి సౌత్ సినిమా ఇండస్ట్రీనే కారణమని, తనకి సౌత్ మూవీస్ లో నటించడం ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

Genelia Sensational Comments on Bollywood:

Genelia Comments on South movies 

Tags:   GENELIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ