పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబోలో త్రివిక్రమ్ సారథ్యంలో సముద్రఖని దర్శకుడిగా తెరకెక్కిన బ్రో మూవీ నుండి ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ ఒక ఎత్తు ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మరో ఎత్తు అన్నట్టుగా బ్రో అవతార్ ట్రైలర్ ని మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేసి వదిలారు. జులై 29 న విడుదల కాబోతున్న బ్రో నుండి ట్రైలర్ ఇంతకుముందే వదిలారు మేకర్స్. పవన్ కళ్యాణ్ గాడ్ గా బ్రో లుక్ లో ఆయన పాత సినిమాల లుక్స్ తో పాటుగా.. అల్ట్రాస్టైలిష్ లుక్ కి ఫాన్స్ తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు.
భస్మాసురుడు అని ఒకడు ఉండేవాడు తెలుసా? మీ మనుషులు అందరూ వాడి వారసులు. ఎవడి తల మీద వాడే పెట్టుకుంటాడు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వరు అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగుతో ట్రైలర్ ప్రారంభమైంది.మార్కండేయుడిగా టైమ్ తో పరిగెత్తే కేరెక్టర్ లో సాయి ధరమ్ తేజ్ కనిపించాడు. ఫ్యామిలీ మ్యాన్ గా అనుబంధాల మధ్యన టైమ్ కన్నా ముందుగా పరుగులు పెడుతూ హడావిడిగా ఉండే సాయి ధరమ్ తేజ్ కి బ్రో గా పవన్ కళ్యాణ్ ఎలా పరిచయమయ్యి టైమ్ తో వెనక్కి ఎలా నడిపించారో బ్రో ట్రైలర్ లో చూపించారు. లుక్స్ విషయంలోనే కాదు.. పెరఫార్మెన్స్ విషయంలోనూ సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ తో పోటీ పడ్డాడు.
విజువల్స్ మాత్రమే కాదు.. నిర్మాణ విలువలు రిచ్ గా కనిపించాయి. అలాగే థమన్ మ్యూజిక్ బ్రో ట్రైలర్ లో మెయిన్ హైలెట్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మామ-అల్లుళ్ళగా డాన్స్, హీరోయిన్ కేతిక శర్మ లుక్స్ అన్ని ఫాన్స్ కి నచ్చేలా ఉండగా.. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ బ్రో ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు మరో రెండు, మూడు రోజుల్లో జరగబోయే బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ ఈవెంట్ కోసం పవన్ ఫాన్స్ వెయిటింగ్ లో ఉన్నారు.