టాలీవుడ్ లో చిన్న సినిమాల హవా కోనసాగుతుంది. వేణు టిల్లు దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం భారీ హిట్ అయ్యింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్స్ తోనే అందరి చూపు ఆ సినిమాపై పడేలా చేసారు మేకర్స్. అలాగే గత నెల చివరి వారంలో శ్రీ విష్ణు-నరేష్ ల సామజవరగమన కూడా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ నెలలో వారం కిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బేబీ మూవీ చిన్న చిత్రంగా విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
మొదటి వారం ముగిసి రెండో వారంలోకి అడుగుపెట్టిన బేబీ మూవీకి కలెక్షన్స్ ప్రవాహం మాత్రం తగ్గడం లేదు. నిన్న శుక్రవారం బోలెడన్ని సినిమాలు విడుదలైన బేబీ కలెక్షన్స్ డ్రాప్ అవ్వకపోవడం గమనార్హం. ఎనిమిది రోజులకి గాను బేబీ మూవీ 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే ఇలా కోట్లు కొల్లగొడుతున్న బేబీ మూవీలో హీరో, హీరోయిన్స్ గా నటించిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య-విరాజ్ అశ్విన్స్ ల పారితోషకాలు వింటే నోరెళ్ళ బెడతారు. బేబీ సినిమాలో నటించినందుకు గాను ఆనంద్ దేవరకొండకు 80 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
బేబీ సినిమాతో హీరోయిన్ గా మారిన వైష్ణవి చైతన్యకు మేకర్స్ 30 లక్షల రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. అలాగే మరో కీలకమయిన కేరెక్టర్ చేసిన విరాజ్ అశ్విన్ కి కూడా 20 లక్షల దాకా పారితోషికం ఇచ్చారని తెలుస్తుంది. అంటే సినిమాకు అతి కీలకమైన ఈ మూడు పాత్రలకు బేబీ మేకర్స్ కేవలం 2 కోట్ల లోపే రెమ్యునరేషన్ తో సరిపెట్టేశారని తెలుస్తుంది. మరి అన్ని కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతూ నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టిన బేబీ నటులకి ఇంత తక్కువ పారితోషకలా అని షాకవుతున్నారు.