Advertisementt

RC16 నేపథ్యం అదే!

Sat 22nd Jul 2023 02:15 PM
rc16  RC16 నేపథ్యం అదే!
Interesting news on RC16 RC16 నేపథ్యం అదే!
Advertisement
Ads by CJ

రెండో సినిమాతోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించి ఆహా అనిపించిన బుచ్చి బాబు.. మొదటి సినిమా ఉప్పెన తర్వాత పెద్ద స్టార్స్ దగ్గరకి వెళ్ళిపోయాడు. సుకుమార్ రిఫరెన్స్ తో ఎన్టీఆర్ తో సినిమా చేద్దామనుకుంటే.. ఎన్టీఆర్ వి ఇప్పుడప్పుడే డేట్స్ ఖాళీ అయ్యేలా కనిపించకపోవడంతో.. అదే సుక్కు సహకారంతో మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే స్టార్ హీరో రామ్ చరణ్ తో సినిమా కమిట్ చేయించారు. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆపేసి రామ్ చరణ్ బుచ్చిబాబు తో RC16 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.

అయితే ఎన్టీఆర్ తో స్పోర్ట్స్ నేపథ్యంలో బుచ్చి బాబు సినిమా ఉండబోతుంది అని ప్రచారం జరిగినప్పటికీ.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం కొత్త కథ సిద్ధం చేసుకున్నాడనే టాక్ మొదలైంది. అయితే RC16 కథా నేపథ్యం ఏమిటి అని మెగా ఫాన్స్ మెదళ్ళు తొలిచేస్తోంది. తాజాగా RC16 కోసం బుచ్చిబాబు కోనసీమ నేపథ్యంలోనే కథ రాసుకున్నాడట. బ్రిటిష్ కాలం నాటి స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ కోసం సముద్రపు సెట్ వేస్తున్నారట. వైజాగ్ తో పాటుగా గోదావరి జిల్లాల తీర ప్రాంతంలో జరిగే కథ గా RC16 ఉండబోతుందట. దీనికి సంబంధించి  బుచ్చి బాబు ఇప్పటికే కథని పూర్తిగా సిద్ధం చేయగా.. దానిలో చిన్న చిన్న మార్పులు తప్ప స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఆగస్టు మొదటివారంలోనే ఈ ప్రాజెక్ట్ కి పూజా కార్యక్రమాలు చేసి చివరి వారంలో రెగ్యులర్ షూట్ కి వెళ్లే ప్లాన్ లో చరణ్-బుచ్చిబాబు ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి.

ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత RC 16తో బుచ్చి బాబు పాన్ ఇండియా అటెంప్ట్ కి సిద్ధమవుతున్నాడు. అసలు ఈ సినిమా స్క్రిప్ట్ లో సుకుమార్ హ్యాండ్ ఉంటుందా.. అలాగే కోనసీమ బ్యాక్డ్రాప్ ప్యాన్ ఇండియా ప్రేక్షకులని ఎంతవరకు ఇంప్రెస్స్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ షూట్ లో అప్పుడప్పుడు బిజీగా ఉంటున్నాడు. ఇక గేమ్ ఛేంజర్ షూటింగ్ బ్రేక్ లో బుచ్చి బాబుతో సెట్స్ మీదకి వెళ్లాలని చరణ్ చూస్తున్నాడు. అందుకే వచ్చే నెలలోనే RC16 ని మొదలు పెట్టాలనే ఆలోచనలో మేకర్స్ కూడా ఉన్నారంటున్నారు.

 

Interesting news on RC16:

RC16 latest update

Tags:   RC16
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ