ప్రభాస్ నుంచి వచ్చే సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులని డిస్పాయింట్ చేస్తూ ఎప్పటికో విడుదలవుతున్నాయి. ఆదిపురుష్ జనవరిలోనే విడుదల కావాల్సి ఉండగా.. జూన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు సలార్ పోస్ట్ పోన్ అంటూ వార్తలు వచ్చాయి. ఇక ప్రాజెక్ట్ K కల్కి కూడా జనవరి 12, 2024 నే విడుదల అంటూ నాగ్ అశ్విన్ ఎప్పుడో ప్రకటించారు. కానీ మధ్యలో తమ్మారెడ్డి భరద్వాజ కల్కి వాయిదా పడే అవకాశం ఉంది అన్నారు. నెక్స్ట్ సమ్మర్ అంటూ అప్పుడే అనుమానం మొదలయ్యేలా చేసారు.
ఇప్పుడు తాజాగా రాజమౌళి కూడా ప్రభాస్ ఫ్యాన్స్ లో అయోమయం క్రియేట్ చేసారు. అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K చిత్రం గ్లింప్స్ ను విడుదల చేశారు. దాంతో పాటే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. కల్కి గ్లింప్స్ వీడియో చూస్తే హాలీవుడ్ స్టయిల్ టేకింగ్ తో అదిరిపోతోంది. కల్కి 2898 ఏడీ చిత్రం ఈ గ్లింప్స్ వీడియో ఎఫెక్ట్ తో డబుల్ హైప్ తెచ్చుకుంది. బాహుబలితో ప్రభాస్ ని ప్యాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన రాజమౌళి కల్కి గ్లింప్స్ వీడియో చూసి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
నాగి, వైజయంతీ మూవీస్ చాలా బాగా తీస్తున్నారు. ఫ్యూచర్ కి చెందిన కథాంశంతో ఇలాంటి సినిమా తీయడం చాలా కష్టం. కానీ మీరంతా కలిసి దీన్ని సాధ్యం చేశారు. ప్రభాస్ డార్లింగ్ అయితే లుక్స్ పరంగా చంపేస్తున్నాడు. మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఇంకొక్కటి మిగిలుంది.. అసలు కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పండి అంటూ రాజమౌళి గారు ప్రభాస్ ఫ్యాన్స్ ని అయోమయంలో పడేసారు. అంటే వచ్చే జనవరిలో కల్కి రిలీజ్ ఉండాలి. రాజమౌళికి ఆ డేట్ తెలిసి కూడా అలా ఎందుకన్నారో తెలియక ప్రభాస్ ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు.