చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో సందడి చేస్తున్న హీరోయిన్ కృతి శెట్టి. ఈమధ్యన గ్లామర్ డోస్ పెంచేకుంటూ పోతుంది. గ్లామర్ చూపించాలి, సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండాలి.. అప్పుడే ఆఫర్స్ వస్తాయి అనుకుంటుంది. గతంలో అంటే పాపకి హిట్స్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ వచ్చి పడ్డాయి. అప్పుడు సోషల్ మీడియాలో హంగామా చెయ్యాల్సిన అవసరం లేకుండా పోయింది. కానీ కొన్నాళ్లుగా కృతి శెట్టి ని ప్లాప్స్ మాత్రమే పలకరిస్తున్నాయి. అదృష్టం, లక్కీ హీరోయిన్ కాస్తా ఐరెన్ లెగ్ హీరోయిన్ అంటూ సంబోధించడం స్టార్ట్ చేసారు.
మడి ఆకట్టుకుని ట్రెడిషనల్ గా ముందుకు వెళితే ప్రేక్షకులు ఆదరించరని, దర్శకనిర్మాతలు ఛాన్స్ ఇవ్వరు అని తెలుసుకున్న కృతి శెట్టి గ్లామర్ గా టర్న్ అయ్యింది. మోడ్రెన్ అవుట్ ఫిట్స్ లో అందాలు ఆరబోసే కృతి శెట్టి ఈ రెయినీ సీజన్ ని బాగా వాడేసింది. గొడుగు పట్టుకుని బుల్లి డ్రెస్ లో వర్షంలో తడుస్తూ ఉన్న పిక్స్ ని వదిలి యూత్ గుండెల్లో సెగలు రేపింది. పింక్ టాప్, బుల్లి స్కర్ట్ లో తెల్లని గొడుగు వేసుకుని వర్షంలో తడుస్తూ అందాలు పరిచేసింది. కృతి శెట్టి వర్షంలో తడుస్తున్న అందాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఆమె నటిస్తున్న ప్రాజెక్ట్స్ కన్నా ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోస్ తోనే ఎక్కువగా ట్రేండింగ్ లో నిలుస్తుంది. తెలుగులో పెద్దగా హడావిడి లేని కృతి శెట్టి తమిళనాట మాత్రం సందడి చేస్తుంది.. వరస ప్రాజెక్ట్స్ తో అభిమానులకి ట్రీట్ ఇస్తుంది.