బాలీవుడ్ లో సక్సెస్ రేట్ కోసం కిందా మీదా పడుతున్న జాన్వీ కపూర్ రీసెంట్ గా వరుణ్ ధావన్ తో కలిసి నటించిన బావల మూవీ థియేటర్స్ లో విడుదల కాకుండా.. డైరెక్ట్ గా ఓటిటి నుండి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో జాన్వీ కపూర్ బావల స్ట్రీమింగ్ అవుతుండగా.. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్రెండ్ అవుతుంది. యంగ్ టైగర్ తో సౌత్ కి ప్యాన్ ఇండియా మూవీ దేవర తో గ్రాండ్ గా ఎంట్రీకి సిద్దమయిన జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ లో కనిపిస్తుందా అని ఎన్టీఆర్ ఫాన్స్, శ్రీదేవి అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇక తాజాగా జాన్వీ కపూర్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఆమె సరికొత్త అందాలు చూపిస్తూ చేయించుకున్న ఫోటో షూట్ ఆమెని ట్రెండ్ అయ్యేలా చేసింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో గ్లామర్ కి కేరాఫ్ లా కనిపించే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు గ్లామర్ అవుట్ ఫిట్స్ తో సరికొత్త అందాలను పరిచయం చేస్తుంది. ఇప్పుడు కూడా జాన్వీ కపూర్ అలాంటి మోడ్రెన్ అవుట్ ఫిట్ లోనే అదరగొట్టేసింది. ఎన్టీఆర్ తో దేవర మూవీ తో హిట్ కొడితే పాపకి సౌత్ అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.
ఇప్పటికే జాన్వీ కపూర్ ని రామ్ చరణ్ - బుచ్చి బాబు మూవీ కోసం సంప్రదిస్తున్నారు.. తమిళనాట జాన్వీ కపూర్ ని కమల్ హాసన్ లాంచ్ చేస్తున్నారు ఇలా ఏవేవో కథనాలు ప్రచారమవుతున్నాయి. చూద్దాం జాన్వీ కపూర్ రెండో సౌత్ మూవీ ఏ హీరోతో మొదలు పెడుతుందో అనేది.