గత వారం చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులని సృష్టించిన బేబీ మూవీ హావా మరో వారం కొసాగడం ఖాయంగా కనబడుతుంది. వర్షాలు ఎదురైనా, చిన్న సినిమాలు పోటీకి వచ్చినా బేబీ కలెక్షన్స్ ఇంకా తగ్గేదేలే అంటున్నాయి. బేబీ ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. ప్రమోషన్స్ తో ఆసక్తి రేకెత్తించిన బేబీ మూవీ యూత్ కి కనెక్ట్ అవడంతో కలెక్షన్స్ పరంగా మేకర్స్ కి కాసుల వర్షం కురిపిస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య కలయికలో SKN తెరకెక్కించిన ఈ చిత్రం జులై 14 న విడుదలయ్యింది.
బేబీ మొదటి రోజు నుంచే మంచి ఫిగర్స్ నమోదు చేసింది. వారం గడిచేలోపు ప్రపంచ వ్యాప్తంగా 49.2 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఇక ఈ వారం కూడా అంటే బేబీ కి రెండో వారం కూడా కలిసొచ్చేలా ఉంది. కారణం ఈవారం విడుదలైన సినిమాలేవీ ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేయలేకపోయాయి. జులై మూడో వారం అంటే ఈ రోజు 21 న పొలోమంటూ చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. అందులో అశ్విన్ బాబు హిడింబ, విజయ్ ఆంటోని హత్య, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, రుహని శర్మ హర్ మూవీస్ తప్ప మిగతాయేవి ఆడియన్స్ కి రిజిస్టర్ అయ్యే సినిమాలు కాదు.
ఇక హిడింబ, హర్, అన్నపూర్ణ ఫోటో స్టూడియో నిరాశపరచగా.. విజయ్ ఆంటోని హత్య మూవీ ఓకె ఓకె అంటున్నారు. అంటే ఈ వారం విడుదలైన చిత్రాలు కూడా సో సో గా ఉండడంతో బేబీ రెండో వారంలో కూడా స్ట్రాంగ్ గా నిలబడి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. అలాగే బేబీ కోసం మరికొన్ని థియేటర్స్ యాడ్ అవ్వబోతున్నాయి. నిర్మాత SKN కి బేబీ మూవీతో భారీ లాభాలొచ్చిపడ్డాయి. గత రాత్రి అల్లు అర్జున్ బేబీ ఈవెంట్ కి వచ్చి మరింతగా హైప్ క్రియేట్ చెయ్యడంతో యూత్ చాలామంది బేబీ మూవీ కోసం థియేటర్స్ కి వెళుతున్నారు.