రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే హీరోయిన్. ఏ విషయానైనా అభిమానులతో పంచుకుంటుంది. డైరీ రాస్తుంది.. ఆ విషయాలను వెల్లడిస్తుంది. తాజాగా చిరు-విజయ్ లతో భారీ బడ్జెట్ మూవీ ఛాన్సులు మిస్ అయినందుకు తెగ బాధపడిపోయిన రష్మిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే.. వావ్ రశ్మికలో ఇంతందం దాగుందా అంటారు. వర్కౌట్స్ లో చమటలు చిందించే రశ్మికలో చాలా అందం ఉంది.. అది అప్పుడప్పుడు కాదు.. ఈమధ్యన తరచుగా బయటికొస్తుంది.
దానికే ఈమధ్య కాస్త ఎక్కువగా మధ్యన ఆరబోసే పనిలో ఉంది. గ్లామర్ మాత్రమే ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అని నమ్మే రష్మిక బాలీవుడ్ నీళ్లు ఒంటపట్టించుకుంది. అందుకే గ్లామర్ డోస్ బాగా పెంచేస్తుంది. ఈమధ్యనే తెలుగులో నితిన్ మూవీ నుంచి రష్మిక తప్పుకుంది అనే ప్రచారం జరిగింది. ఆ విషయంపై రష్మిక ఓపెన్ అవ్వకపోయినా.. దాని గురించి ఫీలయ్యే ఇప్పుడు చిరు, విజయ్ ఛాన్స్ లు పోగొట్టుకుని బాధపడినట్లుగా చెప్పుకొచ్చింది.
తాజాగా రష్మిక రెడ్ టాప్ లుక్ వదిలింది. ఆ లుక్ లో చాలా ర్యాష్ గా కనిపించింది. సింపుల్ గానే కనిపించిన రష్మిక రెడ్ లుక్ మాత్రం యూత్ కి నిద్ర లేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 అలాగే తెలుగు, తమిళంలో రెయిన్ బో మూవీస్ లో నటిస్తున్నఆమె హిందీ యానిమల్ షూటింగ్ ఈమధ్యనే కంప్లీట్ అయ్యింది.