పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై పదే పదే కామెంట్స్ చేసే ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన నేత పవన్ కళ్యాణ్ పై దారుణమైన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. సీఎం అంతటి వ్యక్తే పవన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కనబెడితే.. పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా జగన్.. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు, పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్ పనిచేస్తున్న ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ వేంకటగిరి బహిరంగ సభలో పవన్ పై విరుచుకుపడ్డారు.
నాలుగేళ్లకో పెళ్లి చేసుకునే పవన్ వలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతున్నాడు. అమ్మాయిలని లోబర్చుకోవడం, కడుపు చెయ్యడం, వదిలెయ్యడం, నాలుగేళ్లలోకో పెళ్లి చేసుకోవడం వదిలెయ్యడం పైగా ఒకరితో వివాహబంధంలో ఉంటూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు ఇదే పవన్ కళ్యాణ్ కేరెక్టర్ అంటూ జగన్ పవన్ పై అతి దారుణమైం విమర్శలు చేశారు.
వాలంటీర్లందరూ సేవాభావంతో పనిచేస్తున్నారు. సేవామిత్ర, సేవా రత్నం, సేవా వజ్రాలను తప్పుబడుతున్నారు. మంచి చేస్తున్న వ్యవస్థలను కొంతమంది విమర్శిస్తున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వలంటీర్లను అవమానించరు. వాలంటీర్లు ఎవరూ కొత్తవారు కాదు.. మీ అందరికీ తెలిసిన వాళ్లే. ఎండా, వాన లెక్క చేయకుండా ప్రజలకు వలంటీర్లు సేవలు అందుతున్నాయంటూ జగన్ మాట్లాడగా.. దానికి జనసేన కార్యకర్తలు జగన్ కి కౌంటర్ ఎటాక్స్ ఇస్తున్నారు.
నువ్వు నీతులు చెప్పకూడదు జగన్
మంచి చేసేవారిని ఎవరూ అవమానించరు అన్నావు కదా జగన్,
మరి @PawanKalyan గారిని ఎందుకు పదేపదే పడి ఏడుస్తున్నావు? సిగ్గులేదా @ysjagan🤡
• 3వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులకు దాదాపు 30కోట్లు పైగా సాయం చేస్తున్నందుకా?
• చేతకాని ప్రభుత్వంతో పనులు చేయిస్తున్నందుకా?
• భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడినందుకా?
• ఉద్దానం సమస్య బయటకు తెచ్చినందుకా?
• ఏ పదవి లేకపోయినా ప్రజల కోసం నిలబడినందుకా?
• నీలాంటి నీచులను ఎదుర్కొంటున్నందుకా?
ఎందుకు జగన్ మంచి చేసేవారిని సిగ్గులేకుండా విమర్శిస్తున్నావు? గుర్తుపెట్టుకో జగన్, నీ ప్రభుత్వాన్ని కూలదోస్తాం, నీ అరాచకాలు బయటకు తీస్తాం. సిద్దంగా ఉండు 👍అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.