నేషనల్ క్రష్ రష్మిక బిజీగా కనిపిస్తుంది కానీ.. ఆమె కెరీర్ లో సక్సెస్ లు చాలా తక్కువగా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ తో పుష్ప ప్యాన్ ఇండియా హిట్ తర్వాత రష్మిక మళ్ళీ హిట్ కొట్టలేకపోయింది. అంతేకాకుండా ఇప్పుడు టాలీవుడ్ లో తనకి మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఏదో డేట్స్ అడ్జెస్ట్ కాలేదు అంటున్నారు. అదలా ఉంటే రష్మిక ఇప్పుడు తన కెరీర్ లో వదులుకున్న స్టార్ ఛాన్సెస్ గురించి చెప్పి తెగ ఫీలైపోతుంది.
తాను గతంలో చిరు, కోలీవుడ్ హీరో విజయ్ ఛాన్స్ లు వదులుకుని బాధపడుతున్నట్లుగా చెప్పింది. మొదట్లో మోడలింగ్ చేస్తూ తర్వాతే హీరోయిన్ గా పరిచయమైనట్లుగా చెప్పిన రష్మిక తన కెరీర్ లో మెగాస్టార్ చిరు ఆచార్య, విజయ్ మాస్టర్ సినిమా అవకాశాలు వచ్చినా వదులుకోవడం బాధ అనిపించింది. అంత పెద్ద స్టార్స్ తో అవకాశం రావడం అదృష్టమని, అలాంటిది ఆ అవకాశాలు చేజార్చుకోవడం బాధనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు అదృష్టం వరిస్తుంది. కొన్నిసార్లు దురదృష్టం వెక్కిరిస్తుంది. ప్రేమ, పెళ్లి అనేది కొన్నిసార్లు విడదీయలేని అనుబంధంగా మారుతుంది. అదే బంధం కొన్నిసార్లు బలహీనంగాను కనిపిస్తుంది అంటూ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.