ఈమధ్య కాలంలో భారీ బడ్జెట్ సినిమాలైనా, మీడియం రేంజ్ సినిమాలైనా హిట్ అయితే ఓ లెక్క, ఫట్ అయితే ఓ లెక్క అన్నట్టుగా లేదు. ఓటిటీలలోకి వచ్చే సినిమాలు హిట్ అయితే ఎనిమిది వారాలు, ప్లాప్ అయితే 45 రోజులు అంటూ ఏదో నిర్మాతలు లెక్క వేసుకున్నా.. ఇప్పుడు అది అమలు జరగడం లేదు. హిట్ అయిన మూవీ అయినా నెలలోపే ఓటిటిలోకి వచ్చేస్తుంది. ప్లాప్ మూవీ అయినా మూడు వారలు తిరిగేసరికి ఓటిటిలోకి వస్తుంది. ఈ ట్రెండ్ దసరా మూవీ అప్పటినుండి స్టార్ట్ అయ్యింది. నాని దసరా మూవీ హిట్ అయిన నెల తిరక్కుండానే ఓటిటిలోకి చ్చేసింది.
తాజాగా మరో హిట్ మూవీ సామజవరగమన కుడా నెల పూర్తి కాక ముందే ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చెయ్యబోతుంది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్యన వచ్చే కామెడీ సీన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసారు. అయితే ఇంకా థియేటర్స్ లో కలెక్షన్స్ తెస్తున్న ఈ మూవీ ని ఆహా ఓటిటి వారు భారీ డీల్ తో డిజిటల్ రైట్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు దీనిని ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ లాక్ చేసి అధికారికంగా ప్రకటించారు.
జులై 28 న అంటే వచ్చే శుక్రవారం సామజవరగమన ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా పోస్టర్ వేసి ఆహా వారు అధికారికంగా ప్రకటన ఇచ్చేసారు. అంటే జులై 28 శుక్రవారం సామజవరగమన ఆహా నుండి ఓటిటీ ఫ్యామిలీకి చేరబోతుందన్నమాట.