‘ప్రాజెక్ట్ కె’ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్‌పై రకరకాలుగా వార్తలు, ట్రోల్స్ జరుగుతుండగా.. ఒక్కసారిగా గ్రాఫ్ పడిపోయిందేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఓ కంగారు పడిపోతున్నారు. కానీ అలాంటిదేమీ లేదని.. భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచ పటంపై చాటే చిత్రంగా ‘ప్రాజెక్ట్ K’ ఉండబోతుందనే విషయం తాజాగా వచ్చిన గ్లింప్స్‌తో తెలిసిపోతుంది. అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో ‘ప్రాజెక్ట్ K’ చిత్ర టైటిల్, గ్లింప్స్‌ని గ్రాండ్‌గా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాకు ‘కల్కీ 2898 AD’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక వదిలిన గ్లింప్స్.. అందరూ ఆశ్చర్యపోయేలా ఉందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు.
తెలుగు సినిమా రేంజ్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ మాత్రమే కాదని.. అంతకుమించి అని చాటి చెప్పేలా ఈ గ్లింప్స్ ఉంది. ప్రభాస్ లుక్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. ఈ గ్లింప్స్‌లో మాత్రం ప్రపంచానికి మరో సూపర్ హీరో పరిచయం కాబోతున్నడనే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చేలా ఉంది. ఆయన ఎంట్రీ, అంతకు ముందు, తర్వాత వచ్చే సన్నివేశాలు.. నిజంగా యూనిట్ చెబుతున్నట్లుగా ఇప్పటి వరకు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇటువంటి సినిమా రాలేదనేలానే ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంతో ఏదో అద్భుతం చేయబోతున్నట్లే అనిపిస్తోంది. మొత్తంగా అయితే.. ఈ ఒక్క గ్లింప్స్‌తో అందరి నోళ్లను మూయించాడు నాగ్ అశ్విన్.
గ్లింప్స్‌లో ఒక్కో పాత్రను రివీల్ చేసిన తీరు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్, గ్రాండియర్ లుక్.. ఒక్కటేమిటి? ప్రతీది ఓ రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ధైర్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు. అలా ఉంది గ్లింప్స్. ఇంకా చెప్పాలంటే.. భారతీయ సినిమా నెక్స్ట్ టార్గెట్ హాలీవుడ్.. అది ఈ ‘కల్కీ 2898 AD’ చిత్రంతోనే. ఓ హాలీవుడ్, ఊపిరి పీల్చుకో.. కల్కీ వస్తున్నాడు అని ప్రతి ఒక్కరి నోటి వెంటా ఈ గ్లింప్స్ చూసిన తర్వాత రావాల్సిందే. అలా ఉందీ గ్లింప్స్. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తుండగా కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నారు.