అల్లు అర్జున్ పుట్టిన రోజు కి స్పెషల్ గా వదిలిన పుష్ప ద రూల్ వీడియో తర్వాత ఇప్పటివరకు పుష్ప ద రూల్ నుండి అప్ డేట్ అంటే రిలీజ్ డేట్ ఇవ్వకుండా ఇంకా ఇంకా మేకర్స్ నాన్చుతూనే ఉన్నారు. అసలు ఈ ఏడాది పుష్ప ద రూల్ రిలీజ్ ఉండదు ఇది పక్కా.. అయితే 2024 మార్చ్ అయినా లేదంటే సమ్మర్ కి అయినా పుష్ప ద రూల్ రిలీజ్ ఉండొచ్చనే ఊహాగానాలు తప్ప మేకర్స్ మాత్రం తేదీ ప్రకటించడం లేదు. మధ్యలో ఫహాద్ ఫాసిల్ షూటింగ్ అప్ డేట్ ఇచ్చాక.. మళ్ళీ పుష్ప ద రూల్ షూటింగ్ ఎక్కడివరకు చేసారు, ఏ సీన్స్ తెరకెక్కిస్తున్నారు, ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారు అనేది తెలీనివ్వడం లేదు
అందుకే ఫ్యాన్స్ పుష్ప ద రూల్ షూటింగ్ స్పాట్ నుండి కొన్ని వీడియోస్ షూట్ చేసి లీక్ చేస్తున్నారు. గతంలో నదిలో లారీలు ఎర్ర చందనం లోడుతో వెళుతున్న వీడియో లీక్ చేసారు. ఆ ఎపిసోడ్ షూట్ అప్పుడు లీకైంది. ఇక తాజాగా కూడా నది నీళ్లలో లారీలు ఎర్రచందనం లోడుతో వెళుతున్న వాటర్ ఎపిసోడ్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది వాటర్ యాక్షన్ ఎపిసోడ్ అంటూ ఫ్యాన్స్ దానిని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి మేకర్స్ సకాలంలో అప్ డేట్ ఇవ్వకపోతే ఇలాంటి లీకుల వీడియోస్ నే అందరూ చూడాల్సి వస్తుంది.
సుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ సిటీలో వేసిన స్పెషల్ సెట్ లోనే పుష్ప ద రూల్ షూట్ చేస్తున్నారట, అల్లు అర్జున్ లేని సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజీగా వున్నారని తెలుస్తోంది. రష్మిక, అనసూయ, జగపతి బాబు లాంటి వాళ్ళు ఈ షూట్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది.